2026 T20 World Cup: కెనడా సూపర్ విక్టరీ.. 2026 టీ20 వరల్డ్ కప్ బెర్తు ఖరారు..

Follow

2026 T20 World Cup: వచ్చే ఏడాది జరగబోయే మెన్స్ టీ20 వరల్డ్ కప్ పోటీలకు మరో జట్టు అర్హత సాధించింది. సూపర్ విక్టరీతో కెనడా జట్టు తన బెర్త్ ను కన్ ఫర్మ్ చేసుకుంది. 2026 T20 ప్రపంచ కప్‌లో చోటు దక్కించుకున్న 13వ జట్టుగా నిలిచింది. అమెరికాస్ రీజనల్ క్వాలిఫయింగ్ ఫైనల్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన కెనడా T20 టోర్నమెంట్ లో స్థానం సంపాదించుకుంది.
ఆదివారం జరిగిన క్వాలిఫయింగ్ ఫైనల్స్‌లో బహమాస్ పై సూపర్ విక్టరీ కొట్టింది కెనడా. తొలుత బహమాస్‌ను 57 పరుగులకే పరిమితం చేసిన కెనడా.. స్వల్ప లక్ష్యాన్ని 5.3 ఓవర్లలోనే ఛేజ్ చేసింది. ఈ లీగ్‌లో వరుసగా 5 విజయాలతో దుమ్మురేపింది కెనడా. పాయింట్స్ టేబుల్ లో అగ్రస్థానంలో నిలిచింది. క్రితం సారి కూడా కెనడా ఇదే మార్గంలో ప్రపంచ కప్‌లోకి ప్రవేశించింది. టోర్నమెంట్ లో తొలి మ్యాచ్ లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో తలపడింది.
Also Read: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇందులో ఆడడం అంత ఈజీ కాదు: గంగూలీ
పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026 పోటీలకు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. ఈ మెగా టోర్నీకి ఇప్పటికే 12 జట్లు అర్హత సాధించాయి. భారత్, శ్రీలంక, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా, యూఎస్‌ఏ, వెస్టిండీస్.. వరల్డ్ కప్ రేసులో నిలిచాయి. గత సంవత్సరం సూపర్ 8 దశలో పూర్తి చేయడం లేదా ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉండటం వల్ల ఈ జట్లు అర్హత పొందాయి. మరోవైపు భారత్, శ్రీలంక ఆతిథ్య దేశాలుగా ఉండటం వల్ల అవి కూడా అర్హత సాధించాయి.
మరో 7 జట్లకు బెర్తులు ఖరారు కావాల్సి ఉంది. వీటిలో యూరోపియన్ క్వాలిఫయర్ ద్వారా 2, ఆఫ్రికా క్వాలిఫయర్‌లో ఫైనల్ చేరిన రెండు జట్లతో పాటు ఆసియా ఈఏపీ క్వాలిఫయర్‌లోని టాప్-3 జట్లు వరల్డ్ కప్ పోటీలకు అర్హత సాధిస్తాయి. 20 జట్లతో జరిగే మొట్టమొదటి T20 ప్రపంచ కప్ ఇదే కానుంది.
భారత్, శ్రీలంక, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా, యూఎస్‌ఏ, వెస్టిండీస్.. వరల్డ్ కప్ రేసులో నిలిచాయి.