5 దేశాలు.. 8 రోజులు..
Follow
విదేశీ పర్యటనకు ప్రధాని మోడీ రెడీ
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ ఎనిమిది రోజుల పాటు ఐదు దేశాల్లో పర్యటించనున్నారు. జులై 2 నుంచి ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాల్లో ఆయన పర్యటిస్తారని కేంద్ర విదేశాంగ శాఖలోని ఆర్థిక సంబంధాల కార్యదర్శి దమ్ము రవి వెల్లడించారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా తొలుత జులై 2, 3 తేదీల్లో ఘనాలో పర్యటిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ఘనా అధ్యక్షుడితో ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారన్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని సమీక్షించి.. ఆర్థిక, ఇంధన, రక్షణ సహకారంపై భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ఉన్న అవకాశాలపై నేతలిద్దరూ చర్చించే అవకాశం ఉన్నట్టు తెలిపారు.
బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు బ్రెజిల్ వెళ్తున్న ప్రధాని.. ఈ నేపథ్యంలో గ్లోబల్ సౌత్‌లోని పలు కీలక దేశాలతో భారత్ సంబంధాలను విస్తరించడమే లక్ష్యంగా తన పర్యటన కొనసాగించనున్నారు. దీంతో గత 11 ఏండ్లలో మోడీ అత్యంత సుదీర్ఘమైన దౌత్య పర్యటనల్లో ఇదీ ఒకటి కానుంది. జులై 9 వరకు కొనసాగే ఎనిమిది రోజుల పర్యటనలో ప్రధాని రెండు ఖండాలను కవర్ చేయనున్నారు. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒకేసారి ఐదు దేశాల్లో పర్యటించడం ఇది రెండోసారి. 2016లో ఆయన అమెరికా, మెక్సికో, స్విట్జర్లాండ్, ఆఫ్గానిస్థాన్, ఖతార్‌లో ఒకేసారి పర్యటించారు. అలాగే, 2015 జులైలో ఆయన ఎనిమిది రోజుల పాటు ఆరు దేశాల్లో పర్యటించారు. ఆ సమయంలో రష్యాతో పాటు మధ్య ఆసియా దేశాల్లో మోడీ పర్యటన కొనసాగింది. ఇకపోతే.. ఈసారి జరగనున్న సుదీర్ఘ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ తొలుత జులై 2, 3 తేదీల్లో ఘనాలో పర్యటిస్తారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఘనాలో భారత ప్రధాని పర్యటించడం ఇదే ప్రథమం.
ఈ పర్యటన సందర్భంగా మోడీ.. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని సమీక్షించనున్నారు. ఆర్థిక, ఇంధన, రక్షణ సహకారం తదితర అంశాలపై ఆ దేశాధ్యక్షుడితో చర్చిస్తారని విదేశాంగ శాఖ తెలిపింది. అనంతరం ప్రధాని ట్రినిడాడ్ అండ్ టొబాగొలలో జులై 3, 4 తేదీల్లో పర్యటించనున్నారు. 1999 తర్వాత ఈ దేశంలో భారత ప్రధాని పర్యటించ డం ఇదే తొలిసారి. అనంతరం జులై 4న అర్జెంటీ నాకు వెళ్లనున్న ప్రధాని మోడీ.. 5వ తేదీ వరకు అక్కడే పర్యటిస్తారు. రక్షణ, వ్యవసాయం, మైనింగ్, చమురు, గ్యాస్, పునరుత్పాదక ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు వంటి కీలక రంగాల్లో ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించే అంశంపై అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలేతో విస్తృత చర్చలు జరుపుతారు. ప్రధాని ద్వైపాక్షిక పర్యటన భారత్, అర్జెంటీనా మధ్య బహుముఖ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా బలోపేతం చేస్తుందని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. అనంతరం బ్రెజిల్‌లో 5నుంచి 8వ తేదీ వరకు ప్రధాని మోడీ పర్యటిస్తారు. బ్రెజిల్‌లోని రియో వేదికగా జరగనున్న 17వ బ్రిక్స్ సదస్సులో పాల్గొని ప్రపంచంలో పలు అంశాలపై అభిప్రాయాలను పంచుకోనున్నారు.
ప్రపంచ పాలనా సంస్కరణలు, శాంతి, క ృత్రిమ మేధస్సును బాధ్యతాయుతంగా ఉపయోగించడం, వాతావరణం, ప్రపంచ ఆరోగ్యం, ఆర్థిక అంశాలతో పాటు పలు కీలక అంశాలను ప్రస్తావించే వకాశం ఉంది. అలాగే, ఈ సదస్సు నేపథ్యంలోనే పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. అనంతరం 9న నమీబియాకు వెళ్లి.. ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. నమీబియా పార్లమెంటులోనూ ప్రధాని ప్రసంగించే అవకాశం ఉన్నట్టు సమాచారం. నమీబియాలో ప్రధాని పర్యటన ఆ దేశంతో భారత్‌కు ఉన్న బహుముఖ, లోతైన చారిత్రక సంబంధాలను పునరుద్ఘాటిస్తోందని విదేశాంగ శాఖ పేర్కొంది.
The post 5 దేశాలు.. 8 రోజులు.. appeared first on Navatelangana.
విదేశీ పర్యటనకు ప్రధాని మోడీ రెడీన్యూఢిల్లీ : ప్రధాని మోడీ ఎనిమిది రోజుల పాటు ఐదు దేశాల్లో పర్యటించనున్నారు. జులై 2 నుంచి ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాల్లో ఆయన పర్యటిస్తారని కేంద్ర విదేశాంగ శాఖలోని ఆర్థిక సంబంధాల కార్యదర్శి దమ్ము రవి వెల్లడించారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా తొలుత జులై 2, 3 తేదీల్లో ఘనాలో పర్యటిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ఘనా అధ్యక్షుడితో ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చలు
The post 5 దేశాలు.. 8 రోజులు.. appeared first on Navatelangana.