Secunderabad | రైళ్ల‌ల్లో గొలుసు దొంగ‌త‌నాలు.. ఇద్ద‌రు నిందితులు అరెస్ట్​

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Railwaypolice

Secunderabad | మారేడ్‌పల్లి, జూన్ 20 : రైళ్లల్లో చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల వద్ద నుంచి రూ. 2,98,000ల‌ విలువ చేసే 29.8 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. రైల్వే పోలీసు స్టేషన్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను రైల్వే డిఎస్పీ జావేద్‌, రైల్వే ఇన్‌స్పెక్టర్‌ సాయి ఈశ్వర్‌గౌడ్‌లు వెల్లడించారు.

ఉత్తరప్రదేశ్‌ లోని మీర్జాపూర్‌ జిల్లాకు చెందిన అభయ్‌ రాజ్‌ సింగ్‌ (28) కూలీ, అదే ప్రాంతానికి చెందిన మిథిలేష్‌ గిరి (20) కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వీరిద్దరు స్నేహితులు కావడంతో నిత్యం మద్యం సేవించడం, జూదం, ధూమపానం చెడు అలవాట్లకు బానిసైయ్యారు. వీరికి వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో… దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడడంతో అభయ్‌ రాజ్‌ సింగ్‌ గతంలో జైలు జీవితం గడిపి బెయిల్‌పై వచ్చాడు. వచ్చిన తరువాత కూడ సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో తన స్నేహితుడైన మిథిలేష్‌ గిరితో కలిసి సికింద్రాబాద్‌ రైల్వే పోలీసు స్టేషన్‌ పరిధిలోని పలు రైళ్లలో చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. శుక్రవారం వీరిద్దరు రైల్వే స్టేషన్‌లో అనుమానస్పద స్థితిలో తిరుగుతుండగా రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన నేరాలను అంగీకరించారు. పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులను పట్టుకోవడంలో చాకచాక్యంగా వ్యవహరించిన రైల్వే పోలీసు సిబ్బందిని రైల్వే డిఎస్పీ, ఇన్‌స్పెక్టర్‌ లు అభినంధించారు.

​Secunderabad | రైళ్లల్లో చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల వద్ద నుంచి రూ. 2,98,000ల‌ విలువ చేసే 29.8 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *