గూగుల్, ఇన్ స్టాగ్రామ్,ఫేస్ బుక్ పాస్ వర్డ్లు లీక్ అవుతున్నాయి.. మీ అకౌంట్లు సేఫేనా?..ఇలా చెక్ చేసుకోండి​

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *

గూగుల్, ఇన్ స్టాగ్రామ్,ఫేస్ బుక్ పాస్ వర్డ్లు లీక్ అవుతున్నాయి.. మీ అకౌంట్లు సేఫేనా?..ఇలా చెక్ చేసుకోండి

Caption of Image.

Google, Instagram, Facebook, Apple,X ఖాతాల యూజర్లకు హెచ్చరిక..దాదాపు 16 బిలియన్ల పాస్ వర్డ్ లు లీక్ అయ్యాయని కొత్త రిపోర్టులు చెబుతున్నాయి. ఇవి గూగుల్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ నుంచే ఎక్కువగా ఉన్నాయి. మరి మీ అకౌంట్లు సేఫేనా?.. తెలుసుకోవడం ఎలా అనుకుంటున్నారా.. మీ అకౌంట్లు సురక్షితంగా ఉన్నాయా లేదా తెలుసుకునేందుకు  టూల్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.. 

గూగుల్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రమ్, ఎక్స్ఖాతాల పాస్‌వర్డ్‌లు లీక్ అయ్యాయో లేదో తెలుసుకోవడం చాలా సులభం. మీ సమాచారం లీక్ అయ్యిందో లేదో చెక్ చేసుకునేందుకు చేయడానికి ఉపయోగపడే 4 టూల్స్ గురించి..

Have I Been Pwned: 

ఇది పాస్‌వర్డ్ లీక్‌లను చెక్ చేసేందుకు బెస్ట్ వన్. అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ సైట్. మీ ఇమెయిల్ చిరునామాను నమోదు చేయడం ద్వారా మీ డేటా ఏవైనా దొంగిలించబడిందా  లేదో తెలుసుకోవచ్చు.

Google Password Checkup: 

మీ Google ఖాతాతో అనుసంధానించబడిన పాస్‌వర్డ్‌లను Google స్వయంగా చెక్ చేస్తుంది. ఇది దొంగిలించబడిన పాస్‌వర్డ్‌లను గుర్తిస్తుంది . వాటిని మార్చమని సూచిస్తుంది.

Firefox Monitor: Firefox అందించే ఈ ఉచిత సేవ కూడా డేటా ఉల్లంఘనలను పర్యవేక్షిస్తుంది. మీ ఇమెయిల్ చిరునామాను నమోదు చేయడం ద్వారా మీరు గతంలో దొంగిలించబిన ఖాతాల గురించి తెలుసుకోవచ్చు. 

మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ పాస్‌వర్డ్ మానిటర్

విండోస్ యూజర్లకోసం మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌లో అంతర్నిర్మిత పాస్‌వర్డ్ మానిటర్ ఉంటుంది. ఇది బ్రౌజర్‌లో సేవ్ చేయబడిన పాస్‌వర్డ్‌లను లీక్ అయితే స్కాన్ చేస్తుంది. మీ సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లలో ఏవైనా దొంగిలించబడితే వెంటనే మార్చమని ఎడ్జ్ హెచ్చరిస్తుంది. 

Google డార్క్ వెబ్ మానిటరింగ్ టూల్ ..

Google ఖాతాదారుల కోసం డార్క్ వెబ్ మానిటరింగ్ ఫీచర్‌ను అందిస్తుంది. ఇది మీ ఇమెయిల్, ఫోన్ నంబర్ ,పాస్‌వర్డ్‌ల వంటి డేటా కోసం డార్క్ వెబ్‌ను స్కాన్ చేస్తుంది. ఏవైనా కనిపిస్తే వెంటనే ఈమెయిల్ ,  ఫోన్ నంబర్, పాస్ వర్డులను మార్చుకోవాలని సూచిస్తుంది. 

పాస్ వర్డ్ లీక్ కాకుండా ముఖ్యమైన చిట్కాలు:

  • ఏ ఖాతా పాస్‌వర్డ్ లీక్ అయినట్లు కనుగొన్నా వెంటనే దానిని మార్చండి.
  • స్ట్రాంక్, స్పెషల్ పాస్ వర్డ్ లను ఉపయోగించాలి. 
  • వీలైన చోట టూ-ఫాక్టర్ అథెంటికేషన్ (2FA) ప్రారంభించాలి. ఇది మీ ఖాతాలకు అదనపు భద్రతను అందిస్తుంది.
  • అనుమానాస్పద ఇమెయిల్‌లు లేదా లింక్‌లను క్లిక్ చేయొద్దు.  
  • మీ ఆన్‌లైన్ భద్రతను నిర్లక్ష్యం చేయవద్దు. ఈ టూల్స్ ఉపయోగించి మీ ఖాతాలను తరచుగా చెక్ చేసుకోవాలి. 
©️ VIL Media Pvt Ltd.

​గూగుల్, ఇన్ స్టాగ్రామ్,ఫేస్ బుక్ పాస్ వర్డ్లు లీక్ అవుతున్నాయి.. మీ అకౌంట్లు సేఫేనా?..ఇలా చెక్ చేసుకోండి  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *