ఈ కంపెనీ ఏడాదికి ఒక్కో ఉద్యోగిపై రూ.21 కోట్లు సంపాదిస్తుంది తెలుసా? ఏ కంపెనీ ఎంతో ఫుల్ లిస్ట్..

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *

ప్రపంచంలోని పలు కంపెనీలు ఒక్కో ఉద్యోగిని వాడుకుని కోట్లాది రూపాయల చొప్పున ఆదాయాన్ని సంపాదిస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌ 2017 నుంచి 2022 వరకు తన సబ్‌స్క్రిప్షన్లను రెట్టింపు చేసుకుంది.

ఆ కంపెనీ ప్రతి ఉద్యోగి ద్వారా ఏడాదికి రూ.21.58 కోట్ల ($2.5 మిలియన్) ఆదాయం పొందుతోంది. ప్రపంచ టెక్నాలజీ రంగంలో పలు సంస్థలు ఇలా తమ ఉద్యోగుల ద్వారా ఆశ్చర్యకరమైన స్థాయిలో ఇంత మొత్తంలో ఆదాయం పొందుతున్నాయి. తక్కువ మంది ఉద్యోగులతోనే భారీగా ఆదాయాన్ని రాబట్టే ఈ కంపెనీలు అనేక పరిశ్రమలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.

ఇటువంటి కంపెనీల జాబితాలో ఆపిల్ (Apple), మెటా, ఆల్ఫాబెట్ (గూగుల్ మాతృసంస్థ), ఊబర్ వంటి దిగ్గజాలు ఉన్నాయి. ఉద్యోగుల నుంచి ఈ కంపెనీలు పొందే సగటు ఆదాయం కూడా కోట్ల రూపాయల్లోనే ఉంది. ఈ కంపెనీలు ఉద్యోగుల నైపుణ్యాలపై పెట్టుబడి పెట్టి, తక్కువ మానవ వనరులతో ఎక్కువ ఆదాయాన్ని ఎలా పొందాలో నిరూపిస్తున్నాయి.

Also Read: పాకిస్థాన్‌ అణ్వస్త్ర కార్యక్రమాన్ని అప్పట్లో ఇజ్రాయెల్ ఎందుకు అడ్డుకోలేకపోయింది..? అందుకు ఇండియానే కారణమా..? ఆ సమయంలో అసలేం జరిగిందంటే..

ఏయే కంపెనీ ఒక్కో ఉద్యోగి నుంచి ఎంతెంత ఆదాయం పొందుతోంది?

ర్యాంక్కంపెనీఉద్యోగి నుంచి పొందే ఆదాయం
1నెట్‌ఫ్లిక్స్రూ.21,58,48,760
2ఆపిల్రూ.20,33,11,713
మెటా (ఫేస్‌బుక్)రూ.14,11,77,148
4ఆల్ఫాబెట్ (గూగుల్)రూ.13,34,09,799
5ఊబర్రూ.9,56,57,996
6ఎన్విడీయారూ.9,54,52,318
7మైక్రోసాఫ్ట్రూ.8,79,63,643
8టెస్లారూ.6,58,48,376
9అడోబ్రూ.6,10,02,089
10సెల్స్‌ఫోర్స్రూ.4,61,39,611
11ఇంటెల్రూ.4,54,03,084
12అమెజాన్రూ.3,70,35,709
13ఒరాకిల్రూ.2,44,26,625
14ఐబీఎంరూ.1,81,93,514

Note: ఈ గణాంకాలను ఫోర్బ్స్ గ్లోబల్ తాజా నివేదిక ఆధారంగా ఇచ్చాం.

​ఆపిల్, ఎన్విడీయా, టెస్లా వంటి కంపెనీలు కూడా ఈ జాబితాలో అగ్రస్థానాల్లో ఉన్నాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *