kappathalli | వానలు కురవాలి..వాన దేవుడా.. చిన్నారుల కప్పతల్లి ఆట

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Kappathalli

kappathalli | రాయపోల్, జూన్ 22 : జూన్‌ చివరివారం వచ్చినా చినుకు జాడ లేకపోవడంతో రైతన్న ఎదురుచూపులు తప్పడం లేదు. చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ వరుణ దేవుడు కరుణించాలని.. వర్షాలు కురువాలని కోరుకుంటున్నారు. గ్రామాల్లో చిన్నారులు వానాలు పడాలని ప్రార్థిస్తూ కప్పతల్లి ఆటలు ఆడారు. ఈ సందర్భంగా రోకలికి కట్టిన వస్త్రంతో కప్పను ఉంచి ఇల్లిల్లూ తిరుగగా మహిళలు బిందెలతో నీళ్లు తెచ్చి కప్పతల్లి తడిసేలా నీళ్లు పోయడంతోపాటు చిన్నారులపై నీళ్లు పోశారు.

ఈ సందర్భంగా చిన్నారులు వాన దేవుడో వానదేవుడు.. వానలు కురవాలి.. వాన దేవుడా అంటూ పాటలు పాడారు. కప్పతల్లికి నీళ్లు పోస్తే వానదేవుడు కరుణించి వర్షాలు కురిపిస్తాడని చిన్నారులు కప్పతల్లి ఆటలతోనైనా వర్షాలు పడాలని, పంటలు పండాలని సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం లింగారెడ్డిపల్లి గ్రామంలో ఆదివారం చిన్నారులు కప్పతల్లి ఆటలు ఆడటం కనిపించింది.

విత్తనాలు వేసి నెల రోజులు గడుస్తున్నా వర్షాల జాడ లేకపోవడంతో గ్రామాల్లో మహిళలు బతుకమ్మ ఆటలు, చిన్నారులు కప్పతల్లి ఆటలు. గ్రామాల్లో బొడ్రాయి పండుగలు చేస్తున్నారు. వరుణదేవుడు కరుణించి వర్షాలు కురవాలని రైతులు నిత్యం ఆకాశం వంక చూస్తున్నారు. ఇకనైనా వరుణదేవుడు కరుణించాలని ఆశగా ఎదురుచూస్తున్నారు.

Read Also :

Peddagattu | జీఓ ఇచ్చారు.. నిధులు మరిచారు.. కాంగ్రెస్‌ హయాంలో లింగమంతుల స్వామికి శఠగోపమేనా?

Bigg Boss 9 | బిగ్ బాస్ సంద‌డికి టైం ఫిక్స్ అయిన‌ట్టేనా.. కంటెస్టెంట్స్ ఎవ‌రెవ‌రంటే..!

Road Accident | వేగంగా వెళ్లి చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి..

​ఈ సందర్భంగా రోకలికి కట్టిన వస్త్రంతో కప్పను ఉంచి ఇల్లిల్లూ తిరుగగా మహిళలు బిందెలతో నీళ్లు తెచ్చి కప్పతల్లి తడిసేలా నీళ్లు పోయడంతోపాటు చిన్నారులపై నీళ్లు పోశారు.

ఈ సందర్భంగా చిన్నారులు వాన దేవుడో వానదేవుడు.. వానలు కురవాలి.. వాన దేవుడా అంటూ పాటలు పాడారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *