David Valentine Lawrence: 61 ఏళ్ల వయస్సులో మాజీ పేస్ బౌలర్ కన్నుమూత..!

Follow

David Valentine Lawrence: క్రికెట్ మైదానంలోనే కాకుండా.. జీవితంలోనూ ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఇంగ్లండ్ మాజీ పేస్ బౌలర్ డేవిడ్ వాలెంటైన్ లారెన్స్ (David Valentine Lawrence) తాజాగా 61 ఏళ్ల వయస్సులో మోటార్ న్యూరోన్ డిసీజ్ (MND) వ్యాధితో పోరాడి కన్నుమూశారు. ఇంగ్లాండ్ అభిమానుల్లో ‘సిడ్’ అనే బిరుదుతో నిలిచారు లారెన్స్. ఇంగ్లండ్ తరఫున 1988లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన లారెన్స్, 1988 నుంచి 1992 మధ్య 5 టెస్టులలో ఆది మొత్తం 18 వికెట్లు పడగొట్టాడు. 1991లో ది ఓవల్ వేదికగా వెస్టిండీస్‌పై 5 వికెట్ల అద్భుత ప్రదర్శన కనపరిచాడు. ఆ తరవాత 1992లో వెలింగ్టన్ టెస్టులో మోకాలి తీవ్ర గాయం కారణంగా ఆయన తన అంతర్జాతీయ కెరీర్ అర్థాంతరంగా ముగించాల్సి వచ్చింది.
ఇక 2023 నుంచి ఆయనకు MND (Motor Neurone Disease) అనే తీవ్రమైన నరాలకు సంబంధించిన వ్యాధి నిర్ధారణ అయింది. ఇది ఆయన కండరాలను పరుస్తూ వచ్చింది. చివరికీ ఈ వ్యాధితో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. గ్లోస్టర్ షైర్ కుటుంబం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో.. మేము తీవ్ర బాధతో డేవ్ లారెన్స్ మరణాన్ని ప్రకటిస్తున్నామని.. మైదానంలోనూ, జీవితంలోనూ స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అని పేర్కొన్నారు. ఆయన తుది శ్వాస వరకూ ధైర్యంగా ఆ వ్యాధిని ఎదుర్కొన్నాడని.. ఆయన కుటుంబ సభ్యులు వారి మరణ సమయంలో పక్కనే ఉన్నారని పేర్కొన్నారు.
Read Also: OPPO A5 5G: మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో విడుదలైన ఒప్పో A5..!
డేవిడ్ వాలెంటైన్ లారెన్స్ జీవిత విషయానికి వస్తే.. 1964 జనవరి 28న జన్మించిన ఆయన కేవలం 17 ఏళ్ల వయసులోనే గ్లోస్టర్ షైర్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేశారు. గ్లోస్టర్ షైర్ తరపున ఆయన ఏకంగా 170 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడి ఏకంగా 477 వికెట్లు తీశారు. 7/47 అతని బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్. అలాగే వన్డేల్లో కూడా 110 మ్యాచ్‌లు ఆడిన ఆయన 148 వికెట్లు తీశారు. ఇక ఆయన క్రికెట్ తర్వాత గ్లోస్టర్ షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్‌కు అధ్యక్షుడిగా కూడా పనిచేసారు.
ఇక ఆయన మృతిపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) చైర్మన్ రిచర్డ్ థాంప్సన్ మాట్లాడుతూ.. డేవిడ్ ‘సిడ్’ లారెన్స్ క్రికెట్‌లో చాలామందికి మార్గదర్శిగా నిలిచారు. ఆయన ధైర్యంతో కూడిన వ్యక్తి. ఓ ఫాస్ట్ బౌలర్ గా ఆయన అభిమానులను ఉర్రూతలూగించడమే కాకుండా.. ఓ నాయకుడిగా మార్పుకు దోహదపడ్డారు. ఆయన చేపట్టిన పనులు ఎన్నటికీ చెరగవు. మేము అతని కుటుంబానికి, స్నేహితులకు, క్రికెట్ ప్రపంచానికి మనఃపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నామని అన్నారు.
David Valentine Lawrence: క్రికెట్ మైదానంలోనే కాకుండా.. జీవితంలోనూ ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఇంగ్లండ్ మాజీ పేస్ బౌలర్ డేవిడ్ వాలెంటైన్ లారెన్స్ (David Valentine Lawrence) తాజాగా 61 ఏళ్ల వయస్సులో మోటార్ న్యూరోన్ డిసీజ్ (MND) వ్యాధితో పోరాడి కన్నుమూశారు. ఇంగ్లాండ్ అభిమానుల్లో ‘సిడ్’ అనే బిరుదుతో నిలిచారు లారెన్స్. ఇంగ్లండ్ తరఫున 1988లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన లారెన్స్, 1988 నుంచి 1992 మధ్య 5 టెస్టులలో ఆది మొత్తం 18 వికెట్లు