Fahadh Faasil: పార్టీ లేదా పుష్పా? కొత్త కారు కొన్న ఫహద్ ఫాసిల్.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Fahadh Faasil: పార్టీ లేదా పుష్పా? కొత్త కారు కొన్న ఫహద్ ఫాసిల్.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

ప్రముఖ మలయాళ నటుడు, పుష్ప ఫేమ్‌ ఫహద్ ఫాసిల్ కొత్త కారు కొన్నాడు. ఫోక్స్‌ వ్యాగన్ గోల్ఫ్ GTIని తన గ్యారేజ్‌లోకి తెచ్చుకున్నాడు. ఈ విషయాన్ని వోక్స్‌ వ్యాగన్‌ సంస్థ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. భారత మార్కెట్ కోసం వోక్స్‌వ్యాగన్ GTI కేటాయించిన 150 యూనిట్లలో ఇది కూడా ఒకటి కావడం విశేషం. ఫహద్‌ ఫాసిల్‌ కొనుగోలు చేసిన వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ GTI కారు ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇది గ్రెనడిల్లా బ్లాక్ మెటాలిక్ రంగులో ఉంది. దీని ప్రారంభ ధర రూ. 53 లక్షలు (ఎక్స్-షోరూమ్). పవర్-ప్యాక్డ్ 2.0-లీటర్ ఫోర్-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చిన ఈ కారు గరిష్టంగా 265 హార్స్‌పవర్, 370 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఇంజిన్ 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఇది కేవలం 5.9 సెకన్లలో 0 -100 కి.మీ./గం. స్పీడ్‌కు చేరుకుంటుంది. మొత్తానికి లగ్జరీ కారు కొన్న ఫహాద్ ఫాజిల్ కు సినీ అభిమానులు, నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు, అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఇప్పటికే ఫహద్ ఫాసిల్ గ్యారేజీలో పలు లగ్జరీ కార్లు ఉన్నాయి. మినీ కంట్రీమ్యాన్, లంబోర్గిని ఉరుస్, పోర్షే 911, ల్యాండ్ రోవర్ డిఫెండర్ తదితర కార్లు ఈ జాబితాలో ఉన్నాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే..గతేడాది ఏకంగా మూడు సినిమాల్లో నటించాడు ఫహాద్ ఫాజిల్. ఆవేశం సినిమాతో సోలో హీరోగా సూపర్ హిట్ కొట్టిన అతను పుష్ప 2తో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. అలాగే రజనీకాంత్ నటించిన వేట్టయన్ సినిమాలోనూ ఓ కీలక పాత్ర పోషించి మన్ననలు అందుకున్నాడు. ప్రస్తుతం ఫహాద్ చేతిలో మారేసన్, డోంట్ ట్రబుల్ ది ట్రబుల్, తేవర్ మగన్ 2, ఆక్సిడెన్, పురాణనూరు వంటి క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.

కొత్త కారుతో నటుడు ఫహాద్ ఫాజిల్..

హీరోయిన్, భార్య నజ్రియాతో కలిసి వెకేషన్ లో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

​పుష్ప, పుష్ప2 సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా చేరువై పోయాడు మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్. ఓ వైపు సోలో హీరోగా హిట్స్ కొడుతూనే మరో వైపు స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ రోల్స్ చేస్తూ విజయాలు సాధిస్తున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *