మా సంస్థ విలువను పెంచుతుంది​

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Nithiin

‘మా సంస్థలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత ‘తమ్ముడు’ సినిమాతో మీ ముందుకొస్తున్నాం. మా బ్యానర్‌లో తొలిసారి బ్రదర్‌, సిస్టర్‌ సెంటిమెంట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాం. తప్పకుండా ఈ సినిమా అందరికి నచ్చుతుంది’ అన్నారు అగ్ర నిర్మాత దిల్‌ రాజు. ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ జూలై 4న ప్రేక్షకుల ముందుకురానుంది. నితిన్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి శ్రీరామ్‌ వేణు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలోని ‘భూ అంటూ భూతం’ అనే తొలి గీతాన్ని బుధవారం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ ‘ఈ సినిమా కోసం 80రోజులు అడవిలో షూటింగ్‌ చేశాం. ఫ్యామిలీస్‌, యూత్‌, పిల్లలు అందరూ ఎంజాయ్‌ చేసేలా ఈ సినిమా ఉంటుంది. థియేటర్స్‌ నుంచి బయటకు వచ్చే ముందు ఓ ఫీల్‌గుడ్‌ మూవీని చూశామనే అనుభూతి కలుగుతుంది. మా బ్యానర్‌ విలువను పెంచే సినిమా ఇది’ అని చెప్పారు. కథలోని ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని హీరో నితిన్‌ తెలిపారు. చాలా విరామం తర్వాత తెలుగులో నటించానని, కుటుంబ అనుబంధాలకు పెద్దపీట వేసిన కథ ఇదని నటి లయ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులందరూ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అజనీష్‌ లోక్‌నాథ్‌, రచన-దర్శకత్వం: శ్రీరామ్‌ వేణు.

​‘మా సంస్థలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత ‘తమ్ముడు’ సినిమాతో మీ ముందుకొస్తున్నాం. మా బ్యానర్‌లో తొలిసారి బ్రదర్‌, సిస్టర్‌ సెంటిమెంట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాం. తప్పకుండా ఈ సినిమా అందరికి నచ్చుతుంది’ అన్నారు అగ్ర నిర్మాత దిల్‌ రాజు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *