సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ

Follow

- బీఆర్‌ఎస్‌లో భారీగా చేరిన కాంగ్రెస్ కార్యకర్తలు
- కండువా కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే పట్నం
బొంరాస్‌పేట, జూన్ 18 : సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ నియోజకవర్గంలోని దుద్యాల మండలం కుదురుమళ్ల గ్రామానికి చెందిన 100 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మడిగే శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం బీఆర్‌ఎస్‌లో చేరారు. వీరికి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వారికి ప్రాధాన్యత దక్కడం లేదని తెలిపారు.
అవమానాలు భరించలేక కాంగ్రెస్‌ను వీడినట్టు చెప్పారు. సీఎం సొంత నియోజకవర్గంలో కొత్త, పాత నాయకుల మధ్య సయోధ్య లేదని, గ్రామాల్లో కొత్తగా చేరిన వారికే ప్రాధాన్యతనిస్తూ ఎన్నికల్లో కష్టపడిన వారికి అడుగడుగునా అవమానం జరగడంతోనే పార్టీ మారినట్టు చెప్పారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. సర్పంచ్, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌దే గెలుపు అన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ నియోజకవర్గంలోని దుద్యాల మండలం కుదురుమళ్ల గ్రామానికి చెందిన 100 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మడిగే శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం బీఆర్‌ఎస్‌లో చేరారు.