ఒక్కసారి పెట్టుబడి పెడితే.. ప్రతి నెలా రూ.9 వేలు పొందవచ్చు! బెస్ట్ పోస్టాఫీస్ స్కీమ్

Follow

చాలా మంది ఇప్పుడు చేస్తున్న పనితో పాటు మరో సైడ్ బిజినెస్ చేద్దామని చేతిలో ఉన్న డబ్బును పెట్టుబడిగా పెట్టి చేతులు కాల్చుకుంటూ ఉంటారు. అయితే ఎలాంటి రిస్క్ లేకుండా.. ఒక్కసారి పెట్టుబడి పెట్టి నెల నెలా రూ.9 వేలు చేతికి వస్తుంటే బాగుంటుంది కదా. అలాంటి ఓ సూపర్ స్కీమ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందా.. ఇది పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కం స్కీమ్. రిటైర్మెంట్ తర్వాత నెలవారీ ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు సీనియర్ సిటిజెన్లకు ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు. పోస్టాఫీస్ చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఇదీ ఒకటి. ఇందులో ఒకసారి పెట్టుబడి పెట్టి.. 5 సంవత్సరాల పాటు ప్రతి నెలా వడ్డీ రూపంలో ఆదాయం పొందొచ్చు. మళ్లీ మెచ్యూరిటీకి మీ పెట్టుబడి కూడా మీ చేతికి వస్తుంది.
ఈ స్కీమ్‌లో ఉన్న మరో మంచి విషయం ఏంటంటే.. ఇక్కడ స్టాక్ మార్కెట్‌తో లింక్ ఉండదు. మీ డిపాజిట్ సేఫ్‌గా ఉంటుంది. ఈ స్కీమ్ వడ్డీ రేట్లు, మెచ్యూరిటీ, ఇతర బెనిఫిట్స్ గురించి చూస్తే.. సింగిల్‌గా ఒకరు, జాయింట్‌గా ముగ్గురు కలిసి చేరొచ్చు. మైనర్ పేరిట గార్డియెన్ అకౌంట్ తెరవొచ్చు. కనీసం రూ.1000 నుంచి ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభించొచ్చు. ఇక గరిష్టంగా సింగిల్ అకౌంట్ కింద రూ. 9 లక్షలు, జాయింట్ అకౌంట్ కింద రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టొచ్చు. ప్రస్తుతం ఇందులో 7.40 శాతం వడ్డీ రేటు ఉంది. ఈ వడ్డీ రేటు ప్రకారం.. చేతికి ప్రతి నెలా డబ్బులు వస్తాయి.
పోస్టాఫీస్ పథకాల్లో వడ్డీ రేట్లు ప్రతి 3 నెలలకు ఓసారి కేంద్ర ప్రభుత్వం సవరిస్తుంది. ఇక్కడ వడ్డీ రేట్లను పెంచొచ్చు లేదా తగ్గించొచ్చు లేదా స్థిరంగా కూడా ఉంచొచ్చు. చాలా కాలంగా ఈ వడ్డీ రేటు మాత్రం స్థిరంగానే ఉంది. ఇక ఐదేళ్లకు ముందుగా విత్‌డ్రా చేసుకోవాలంటే.. వడ్డీ రేట్లలో కాస్త కోత పడుతుంది. సింగిల్ అకౌంట్ కింద గరిష్టంగా రూ. 9 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 7.40 శాతం వడ్డీ రేటు ప్రకారం.. నెలవారీగా రూ.5550 పొందొచ్చు. ఇలా ఐదేళ్లు అందుకోవచ్చు. అదే రూ.5 లక్షలు జమ చేస్తే ప్రతి నెలా చేతికి రూ.3,083 వస్తుందని చెప్పొచ్చు. 3 లక్షలు డిపాజిట్ చేస్తే ప్రతి నెలా రూ.1850 వస్తుంది. ఇదే జాయింట్ అకౌంట్ కింద గరిష్ట పెట్టుబడి అయిన రూ.15 లక్షలు జమ చేస్తే.. ప్రతి నెలా చేతికి రూ.9,250 వస్తుంది. రూ.12 లక్షలు జమ చేస్తే రూ.7,400 చొప్పున చేతికి వస్తుంది.
మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (MIS) ఒక సురక్షితమైన పెట్టుబడి ఎంపిక, ఇది నెలవారీ ఆదాయాన్ని అందిస్తుంది. కనీసం రూ.1000 నుండి పెట్టుబడి పెట్టవచ్చు, గరిష్టంగా సింగిల్ అకౌంట్‌కు రూ.9 లక్షలు, జాయింట్ అకౌంట్‌కు రూ.15 లక్షలు. ప్రస్తుతం 7.40 శాతం వడ్డీ రేటుతో, నెలవారీ ఆదాయాన్ని పొందవచ్చు.