Actor Sriram : డ్ర‌గ్స్ క‌ల‌క‌లం.. చెన్నై పోలీసుల అదుపులో హీరో శ్రీరామ్‌..

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Actor Sriram arrested in drugs case Report

కోలీవుడ్ హీరో శ్రీరామ్ డ్ర‌గ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఈ విష‌యం ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ ఇండ‌స్ట్రీల‌లో సంచ‌ల‌నంగా మారింది.

మాజీ ఏఐడీఎంకే నేత ప్రసాద్ నుండి శ్రీరామ్ డ్రగ్స్ కొన్నట్లు ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. డ్ర‌గ్స్ కేసులో అరెస్టైన వారు ఇచ్చిన స‌మాచారంతో న‌టుడిని చెన్నై పోలీసులు ఆయ‌న్ను అదుపులోకి తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది.

రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో న‌టుడికి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఆయన నుంచి బ్ల‌డ్ శాంపిల్స్‌ను సేక‌రించిన‌ట్లు తెలుస్తోంది. అనంత‌రం అత‌డిని నుంగంబాక్కం స్టేషన్‌కు తరలించారు. దాదాపు రెండు గంట‌లుగా విచారిస్తున్న‌ట్లు కోలీవుడ్‌లో వార్త‌లు వ‌స్తున్నాయి.

Salman Khan: ట్రైజెమినల్ న్యూరాల్జియా, బ్రెయిన్ అన్యూరిజం, AVM.. సల్మాన్ ఖాన్‌కు అరుదైన వ్యాధులు.. ఏంటివి..?.. ప్రతిరోజూ నరకమే..

శ్రీరామ్ అస‌లు పేరు శ్రీకాంత్‌. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ఏపీకి చెందిన అత‌డు సినిమాల‌పై ఇష్టంతో చెన్నైకి వెళ్లాడు. త‌న పేరును శ్రీరామ్‌గా మార్చుకున్నాడు. త‌మిళ చిత్రం రోజా కూటంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రం తెలుగులో రోజా పూలు పేరుతో విడుద‌లైంది. ‘ఒక‌రికి ఒక‌రు’ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌ర అయ్యారు. తెలుగు, త‌మిళ చిత్రాల్లో హీరోగానే కాకుండా ప‌లువురు స్టార్ హీరోల చిత్రాల్లో కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

​కోలీవుడ్ హీరో శ్రీరామ్ డ్ర‌గ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *