Atal Pension Yojana : ఈ APY ప్రభుత్వ పథకంలో చేరితే.. భార్యాభర్తలకు జీవితాంతం నెలకు రూ.10వేలు పెన్షన్.. ఇలా అప్లయ్ చేసుకోండి!

Follow

Atal Pension Yojana : ప్రస్తుత రోజుల్లో ఆర్థికపరమైన అవసరాలకు డబ్బు చాలా ముఖ్యం. కొన్ని అత్యవసర పరిస్థితుల్లో లేదా ముఖ్యంగా వృద్ధాప్యంలో ఆర్థికంగా డబ్బు అవసరం (Atal Pension Yojana) ఉంటుంది. అలాంటి వారు ఎవరిపై ఆధారపడకుండా జీవించాలంటే తప్పనిసరిగా ఎంతో కొంత నెలవారీ ఆదాయం ఉండి తీరాలి. కానీ, ఆ వయస్సులో వారు ప్రత్యేకంగా సంపాదించలేరు. అందుకే ఇలాంటి వారికోసం అనేక
ప్రైవేట్, ప్రభుత్వ పథకాలు అందుబాటులో ఉన్నాయి.
అందులో అటల్ పెన్షన్ యోజన (APY) ఒకటి.. రిటైర్మెంట్ తర్వాత చాలా మంది వృద్ధులకు ఇదో అద్భుతమైన పథకం. ఈ పథకంలో భార్యాభర్తలిద్దరూ చేరవచ్చు. ఇద్దరికి కలిపి నెలకు రూ. 10వేల వరకు పెన్షన్ పొందవచ్చు. ప్రభుత్వం ఈ పథకాన్ని అసంఘటిత రంగ ప్రజల కోసం ప్రారంభించింది. తక్కువ ఆదాయ వర్గాల వారికి వృద్ధాప్యంలో పెన్షన్ అందించడమే ఈ పథకం ఉద్దేశం. ఈ పథకంలో చేరడం ద్వారా భార్యభర్తలిద్దరూ జీవితాంతం పెన్షన్ పొందవచ్చు.
రూ. 10వేలు పెన్షన్ ఎలా పొందాలి? :
అటల్ పెన్షన్ యోజన పథకం కింద 60 ఏళ్ల వయస్సు తర్వాత నెలవారీ రూ. 1,000 నుంచి రూ. 5,000 వరకు పెన్షన్ పొందవచ్చు. భార్యాభర్తలిద్దరూ వేర్వేరు అకౌంట్లను ఓపెన్ చేసి ఉంటే.. ఇద్దరికీ ఒక్కొక్కరికి రూ. 5వేల చొప్పున మొత్తం రూ. 10వేలు పెన్షన్ పొందవచ్చు. వృద్ధాప్యంలో ఈ పెన్షన్ వారికి ఆర్థికంగా ఆదుకుంటుంది.
అర్హతలేంటి? :
ఈ పథకంలో చేరేవాళ్లు (Atal Pension Yojana) వయస్సు 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంత చిన్న వయస్సులో అప్లయ్ చేస్తే.. మీరు చెల్లించాల్సిన నెలవారీ ప్రీమియం అంత తక్కువగా ఉంటుంది. ఈ ప్రీమియం మీ బ్యాంక్ అకౌంట్ నుంచి నుండి నేరుగా ఆటో-డెబిట్ అవుతుంది.
నెలవారీ ఎంత చెల్లించాలంటే? :
ఈ పథకంలో చేరే వ్యక్తి 30 ఏళ్ల వయస్సులో నెలకు రూ. 5వేలు పెన్షన్ కోరుకుంటే.. నెలకు రూ. 577 చెల్లించాలి. 35 ఏళ్ల వయస్సులో చేరితే నెలకు దాదాపు రూ. 902 చెల్లించాలి. ఏ వయస్సులో ఈ పథకంలో చేరినా భవిష్యత్‌లో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించవచ్చు.
అటల్ పెన్షన్ యోజన పథకం ప్రయోజనాలివే :
అటల్ పెన్షన్ పథకం అనేది ప్రభుత్వ (Atal Pension Yojana) పథకం. 60 ఏళ్ల వయస్సు తర్వాత నెలవారీ పెన్షన్ పొందవచ్చు. రిటైర్మెంట్ తర్వాత డబ్బు పరంగా లోటు ఉండదు. చిన్న వయస్సులోనే ఈ పథకంలో చేరితే నెలకు కట్టాల్సిన వాయిదా చాలా తక్కువగా ఉంటుంది.
చందాదారుడు 60 ఏళ్ల ముందు లేదా తరువాత మరణిస్తే.. భార్య లేదా నామినీకి ఆ మొత్తం అందుతుంది. అటల్ పెన్షన్ యోజన కింద పొందే ఆదాయంపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80CCD (1B) కింద పన్ను ప్రయోజనాలను కూడా పొందవచ్చు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి? :
ఈ పథకానికి మీ సమీప బ్యాంకు లేదా పోస్టాఫీసులో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు అవసరమైన డాక్యుమెంట్లు తప్పక కలిగి ఉండాలి.
- ఆధార్ కార్డు
- మొబైల్ నంబర్
- బ్యాంకు అకౌంట్
ఈ పథకం బ్యాంకులలో ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉంది. దరఖాస్తు ప్రక్రియ చాలా సులభం. భార్యాభర్తలిద్దరూ వృద్ధాప్యంలో ఎవరిపైనా ఆధారపడకుండా బతకొచ్చు.
Atal Pension Yojana : రిటైర్మెంట్ తర్వాత ఎవరిపై ఆధారపడకుండా బతకాలంటే ఆర్థికంగా స్థిరత్వం ఉండాలి. అటల్ పెన్షన్ యోజన కింద భార్యాభర్తలిద్దరూ కలిపి ప్రతి నెలా రూ. 10వేలు పెన్షన్ పొందవచ్చు..