Cylinder blast | ఇంట్లో వంట చేస్తుండగా పేలిన సిలిండర్..

Follow

Cylinder blast | నిజాంపేట్, జూన్ 23 : రోజు దినచర్యలో భాగంగా ఇంట్లో వంట చేస్తున్న సమయంలో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన జంబికుంటలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో వంట చేస్తున్న వ్యక్తి చేతులు, పెంకుటిల్లు మొగురాలు, కాలాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండల పరిధిలోని జంబికుంట గామానికి చెందిన నిరుడి మోహన్ ఇంట్లో సిలిండర్ పేలింది.
గత రెండు రోజుల నుండి గ్రామంలో భూలక్ష్మి అమ్మవారి జాతర ఉత్సవాలు జరుగుతుండగా ఊరిలో బంధువులతో సందడి నెలకొంది. ఇంట్లో బంధువులు ఉండటంతో సోమవారం ఉదయం అల్పాహరం కోరకు వంట చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా సిలిండర్ పేలడంతో వంట చేస్తున్న వ్యక్తి చేతులు కాలాయి. అంతలోనే మంటలు మండుతూ ఎగిసిపడటంతో ఇంటి మొగురాల్లు, సరం, ఇంటిలో విద్యుత్ దీపాల కోరకు ఏర్పాటు చేసుకున్న బోర్డులు వైరుతో సహా అన్ని కాలిపోయాయి.
చుట్టు పక్కల వారు సంఘటనా స్థలానికి వచ్చి ఎంత ప్రయత్నం చేసినా మంటలు అదుపులోకి రాకపోవడంతో చాలాసేపు తిప్పలు పడాల్సి వచ్చిందని గ్రామస్తులు తెలిపారు. అధికారులు స్పందించి వారికి తగిన సహయం అందించాలని గ్రామస్తులు,మాజి సర్పంచ్ రఘుపతి రెడ్డి కోరారు.
Read Also :
Alumni | ఎన్నాళ్లకెన్నాళ్లకు.. పాతికేళ్ల తర్వాత పూర్వ విద్యార్థులంతా కలిశారు
Rayaparthi | వ్యవసాయ భూములకు వెళ్లే బాట కబ్జా.. కలెక్టరేట్ ఎదుట రైతుల నిరసన
Suryapet | కేసుల పరిష్కారంలో న్యాయవాదుల సహకారం అవసరం : జూనియర్ సివిల్ జడ్జి ఆయేషా సరీన
Cylinder blast | గత రెండు రోజుల నుండి జంబికుంట గ్రామంలో భూలక్ష్మి అమ్మవారి జాతర ఉత్సవాలు జరుగుతుండగా ఊరిలో బంధువులతో సందడి నెలకొంది. ఇంట్లో బంధువులు ఉండటంతో సోమవారం ఉదయం అల్పాహరం కోరకు వంట చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా సిలిండర్ పేలింది.