Tejeshwar Murder Case: తేజేశ్వర్ హత్య కేసు.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు.. హత్యకు కారణం అదే!

Follow

ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. తేజేశ్వర్ ను చంపేందుకు 4 సార్లు ప్రయత్నం చేసి విఫలం అయినట్లు పోలీసులు తెలిపారు. 5 వ సారి సక్సెస్ అయ్యింది సుపారీ బ్యాచ్. మాస్టర్ మైండ్ అంతా తిరుమల రావుది అని పోలీసులు భావిస్తున్నారు. సుపారీ టీమ్ తేజేశ్వర్ ను చేను సర్వే చేయాలని తీసుకెళ్లినట్లు గుర్తించారు. దాడి సమయంలో తప్పించుకునే ప్రయత్నం చేశాడు తేజేశ్వర్. గద్వాల మండలం వీరాపురం స్టేజి వద్దే హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సెక్సువల్ జలసి కారణంగానే మర్డర్ చేశారని పోలీసులు భావిస్తున్నారు. హంతకులకు స్థానికంగా అందిన సహకారంపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలిపారు.
Also Read:Gadwal Murder : పెళ్లైన తరువాత ప్రియుడితో 2000 ఫోన్ కాల్స్.. వెలుగులోకి కీలక విషయాలు
సర్వేయర్ తేజేశ్వర్ వివాహంలోనూ ట్విస్టులు చోటుచేసుకున్నాయి. తేజేశ్వర్, ఐశ్వర్యలకు ఫిబ్రవరి 13న పెద్దలు పెళ్లి నిశ్చయించారు. వివాహం ఫిక్స్ అయ్యాక ఫిబ్రవరి 8న బ్యాంకు ఉద్యోగితో ఐశ్వర్య లేచిపోయింది. ఫిబ్రవరి 15న మళ్లీ ఇంటికి తిరిగి వచ్చింది ఐశ్వర్య. ఈ వ్యవహారం అంతా పెళ్లికొడుకుకు తెలియడంతో పెళ్లి రద్దు చేసుకున్నరు ఇరు కుటుంబాలు. అయితే తిరిగి తేజేశ్వర్ తో మాటలు కలిపింది ఐశ్వర్య. మా అమ్మ కట్నం ఇవ్వలేక ఇబ్బంది పడుతుంటే బంధువుల ఇంటికి వెళ్లాలని నమ్మబలికింది. తేజేశ్వర్, ఐశ్వర్య మధ్య ప్రేమ చిగురించింది. కుటుంబ సభ్యులు ఆ అమ్మాయి వద్దు అని చెప్పినా వినకుండా ప్రేమ వ్యవహారంతో పెళ్లి చేసుకున్నాడు తేజేశ్వర్. మే 18న పెళ్లి జరగగా.. జూన్ 17న కిడ్నాప్ అయి హత్యకు గురయ్యాడు. జూన్ 21న నంద్యాల జిల్లా పాణ్యం దగ్గర తేజేశ్వర్ డెడ్ బాడీని గుర్తించారు పోలీసులు.
ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. తేజేశ్వర్ ను చంపేందుకు 4 సార్లు ప్రయత్నం చేసి విఫలం అయినట్లు పోలీసులు తెలిపారు. 5 వ సారి సక్సెస్ అయ్యింది సుపారీ బ్యాచ్. మాస్టర్ మైండ్ అంతా తిరుమల రావుది అని పోలీసులు భావిస్తున్నారు. సుపారీ టీమ్ తేజేశ్వర్ ను చేను సర్వే చేయాలని తీసుకెళ్లినట్లు గుర్తించారు. దాడి సమయంలో తప్పించుకునే ప్రయత్నం చేశాడు తేజేశ్వర్. గద్వాల మండలం వీరాపురం స్టేజి