అమ్మాయిల పొట్టి పోరుకు ముహూర్తం

Follow

- మహిళల టీ20 ప్రపంచకప్ 2026 షెడ్యూల్ విడుదల
- జూన్ 12 నుంచి జులై 5 దాకా మెగా టోర్నీ
- పాక్ మ్యాచ్‌తో వేట ఆరంభించనున్న భారత్
దుబాయ్: క్రికెట్ అభిమానులకు వరుస ఏడాదుల్లో మెగా టోర్నీల మజాను అందించడానికి ఐసీసీ సిద్ధమైంది. ఈ ఏడాది భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించతలపెట్టిన మహిళల వన్డే ప్రపంచకప్‌నకు ఇటీవలే షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ.. తాజాగా వచ్చే ఏడాది ఇంగ్లండ్ ఆతిథ్వమివ్వబోతున్న మహిళల టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్‌నూ విడుదల చేసింది. జూన్ 12 నుంచి మొదలుకాబోయే ఈ మెగా టోర్నీ జులై 5న క్రికెట్ పుట్టినిల్లు లార్డ్స్ వేదికగా జరుగబోయే ఫైనల్‌తో ముగుస్తుంది.
ఏడు వేదికల్లో 12 జట్లు తలపడనున్న ఈ ధనాధన్ పోరులో.. జూన్ 30న తొలి, జులై 2న రెండో సెమీస్ జరుగనుంది. ఇంగ్లండ్‌లోని ఎడ్జ్‌బాస్టన్, హాంప్‌షైర్ బౌల్, హెడింగ్లీ, ఓల్డ్ ట్రాఫర్డ్, ది ఓవల్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్స్, లార్డ్స్‌లో మ్యాచ్‌లు జరుగనున్నాయి. జూన్ 12న ఆతిథ్య ఇంగ్లండ్.. ఎడ్జ్‌బాస్టన్‌లో శ్రీలంకతో జరుగబోయే మ్యాచ్‌తో టోర్నీ మొదలవనుంది. భారత జట్టు దాయాది పాకిస్థాన్‌తో జూన్ 14న ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగే మ్యాచ్‌తో టైటిల్ వేటను ఆరంభించనుంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య జూన్ 28న లార్డ్స్‌లో జరిగే మ్యాచ్‌తో లీగ్ దశకు తెరపడనుంది.
రెండు గ్రూపులు
12 జట్లు పాల్గొననున్న ఈ టోర్నీలో జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-1లో ఆరుసార్లు విజేత ఆస్ట్రేలియా, నిరుటి ఎడిషన్ రన్నరన్ దక్షిణాఫ్రికా, భారత్, పాకిస్థాన్‌తో పాటు రెండు క్వాలిఫయింగ్ టీమ్స్ (ఇంకా ఖరారు కాలేదు) ఉండగా.. గ్రూప్-2లో డిఫెండింగ్ చాంపియన్స్ న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక, ఇంగ్లండ్, రెండు క్వాలిఫయింగ్ టీమ్స్ ఉన్నాయి. లీగ్ దశ ముగిసేసరికి గ్రూప్‌లో టాప్-2లో ఉన్న నాలుగు జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి.
క్రికెట్ అభిమానులకు వరుస ఏడాదుల్లో మెగా టోర్నీల మజాను అందించడానికి ఐసీసీ సిద్ధమైంది. ఈ ఏడాది భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించతలపెట్టిన మహిళల వన్డే ప్రపంచకప్‌నకు ఇటీవలే షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ.. తాజాగా వచ్చే ఏడాది ఇంగ్లండ్ ఆతిథ్వమివ్వబోతున్న మహిళల టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్‌నూ విడుదల చేసింది.