మాగంటికి ఘన నివాళి

Follow

- సంస్మరణ కార్యక్రమంలో నివాళులర్పించిన
- మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యేలు
- భారీగా తరలివచ్చిన బీఆర్‌ఎస్ శ్రేణులు
బంజారాహిల్స్, జూన్ 18: జూబ్లీహిల్స్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సంస్మరణ కార్యక్రమం బుధవారం జూబ్లీహిల్స్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, కేపీ.వివేకానంద్, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, మహమూద్ అలీ, పువ్వాడ అజయ్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ ఎంపీ వినోద్‌కుమార్, ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు విష్ణువర్ధన్‌రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు, శంకర్ నాయక్, దయాకర్‌రావు, తాతా మధు, నారదాసు లక్ష్మణ్‌రావు, ఎంఎన్.శ్రీనివాస్, రావుల శ్రీధర్‌రెడ్డి, కార్పొరేటర్లు దేదీప్యరావు, రాజ్‌కుమార్ పటేల్, వెల్దండ వెంకటేశ్, సంగీతాయాదవ్ తదితరులు మాగంటి గోపీనాథ్‌కు నివాళులర్పించి మాగంటి కుటుంబసభ్యులను పరామర్శించారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంతోపాటు పలు నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి తమ అభిమాన నేత చిత్రపటానికి నివాళులర్పించారు. ‘జై గోపన్న’నినాదాలతో జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్ మార్మోగింది.
జూబ్లీహిల్స్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సంస్మరణ కార్యక్రమం బుధవారం జూబ్లీహిల్స్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా నిర్వహించారు.