ప్రేమ తత్వం బోధపడేలా 8 వసంతాలు మూవీ : ఫణీంద్ర నర్సెట్టి

Follow

అనంతిక సనీల్ కుమార్ లీడ్ రోల్‌లో ఫణీంద్ర నర్సెట్టి తెరకెక్కించిన చిత్రం ‘8 వసంతాలు’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మించారు. ఈనెల 20న సినిమా విడుదలవుతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘శుద్ధి అయోధ్య పాత్రలో అనంతిక అద్భుతంగా నటించింది. ఈ సినిమా అంతా రివర్స్‌లో వెళ్తుంది కనుక ప్రారంభ సన్నివేశాలు మిస్ అవ్వొద్దు. నేను కమర్షియల్ సినిమా తీయలేక కాదు తీయాలని లేక. తప్పకుండా నా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ప్రేక్షకుడిగా థియేటర్‌కి వెళ్ళిన ప్రేక్షకులు ప్రేమికులుగా తిరిగివస్తారు.. ఎందుకంటే వాళ్లకు ప్రేమ తత్వం బోధపడుతుంది’ అని చెప్పాడు. యాక్షన్, ఎమోషన్, లవ్ లాంటి అన్ని ఎలిమెంట్స్ ఉన్న ఈ చిత్రంలో తను పోషించిన శుద్ధి అయోధ్య పాత్రకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారని అనంతిక చెప్పింది.
నిర్మాతలు రవిశంకర్, నవీన్ ఎర్నేని మాట్లాడుతూ ‘ఇందులో చాలా ఎమోషనల్ కంటెంట్ చెప్పాడు ఫణి. ఒక అమ్మాయి జర్నీనే ఈ సినిమా. కాశ్మీర్, ఊటీ, వారణాసి, ఆగ్రా లాంటి బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో తీశాం. ఈ ప్రయత్నం కచ్చితంగా సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాం’ అన్నారు. అతిథులుగా హాజరైన డైరెక్టర్స్ నందిని రెడ్డి, నీరజ కోన బెస్ట్ విషెస్ చెప్పారు. నటులు హను రెడ్డి, రవితేజ, కన్నా పసునూరి, లిరిక్ రైటర్ వనమాలి, మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్, ఎడిటర్ శశాంక్, డిఓపి విశ్వనాథ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రేమ తత్వం బోధపడేలా 8 వసంతాలు మూవీ : ఫణీంద్ర నర్సెట్టి