రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు..!
Follow
నవతెలంగాణ-హైదరాబాద : వేసవి సెలవుల తర్వాత పాఠశాలలకు, కళాశాలలకు సెలవు లేవు. దాంతో విద్యార్థులు నిరాశతో ఉన్నారు. ఈ క్రమంలో శుక్రవారం సడన్ గా సెలవు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 20వ తేదీన మావోయిస్టులు బందుకు పిలుపునిచ్చారు. దాంతో పాఠశాలలు, కళాశాలలకు, కొంత మంది ఉద్యోగులకు కూడా సెలవులు ఇచ్చే అవకాశం ఉంది.
కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను అణిచివేతలో భాగంగా ఆపరేషన్ కగార్ చేపడుతుంది. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికి ఎంతోమంది మావోయిస్టులు చనిపోగా మరికొందరు అరెస్ట్ కూడా అయ్యారు. కాగా ఆపరేషన్ కగార్ ఆపాలని నిరసనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టులు జూన్ 20వ తేదీన తెలుగు రాష్ట్రాల బందుకు పిలుపునిచ్చారు. రెండు రాష్ట్రాల ప్రజలు సహకరించాలని వారు అభ్యర్థించారు.
దాంతో బంద్ నిర్ణయం వల్ల శుక్రవారం సడన్ గా సెలవు వచ్చే అవకాశం ఉంది. మావోయిస్టుల బందు పిలుపుకు కొన్ని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, వామపక్ష పార్టీలు కూడా మద్దతు తెలియజేసి బందును విజయవంతం చేసే దిశగా ప్రయత్నాలు చేసే అవకాశాలు.
The post రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు..! appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద : వేసవి సెలవుల తర్వాత పాఠశాలలకు, కళాశాలలకు సెలవు లేవు. దాంతో విద్యార్థులు నిరాశతో ఉన్నారు. ఈ క్రమంలో శుక్రవారం సడన్ గా సెలవు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 20వ తేదీన మావోయిస్టులు బందుకు పిలుపునిచ్చారు. దాంతో పాఠశాలలు, కళాశాలలకు, కొంత మంది ఉద్యోగులకు కూడా సెలవులు ఇచ్చే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను అణిచివేతలో భాగంగా ఆపరేషన్ కగార్ చేపడుతుంది. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయి.
The post రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు..! appeared first on Navatelangana.