Elon Musk: సెనెట్‌లో బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ఆమోదం.. మండిపడిన ఎలాన్ మస్క్

Follow

Elon Musk: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌ల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ట్రంప్ పాలకవర్గం తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్‌ను ఆయన తీవ్రంగా వ్యతిరేకించడమే దీనికి ప్రధాన కారణం. తాజాగా ఈ బిల్లుపై సెనెట్‌లో ఓటింగ్ జరగడానికి కొన్ని గంటల ముందు ఎక్స్‌లో వరుస పోస్టులు పెట్టారు మస్క్.. ఈ బిల్లు అమెరికాలోని మిలియన్ల మంది ఉద్యోగాలను నాశనం చేస్తుందని అందులో రాసుకొచ్చాడు. దీని వల్ల దేశానికి అపారమైన నష్టం కలిగిస్తుందన్నారు ఎలాన్ మస్క.
Read Also: DilRaju : సినిమాల్లోకి రావాలనుకునే వారికోసం ‘దిల్ రాజు డ్రీమ్స్’
అయితే, ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఒక విధ్వంసకర చర్య అని మస్క్ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో అమెరికాలోని పరిశ్రమలను కూడా తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆరోపించారు. మరో పోస్టులో ఈ బిల్లు రిపబ్లికన్ల యొక్క రాజకీయ ఆత్మహత్యగా పేర్కొంటూ నిర్వహించిన పోల్‌ను ప్రస్తావించారు. ఇది రుణ పరిమితిని 5 ట్రిలియన్ డాలర్లకు పెంచుతుందని ఎలాన్ మస్క్ వెల్లడించారు. కాగా, ట్రంప్ తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు సెనెట్‌లో ఆమోదం లభించింది. తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగిన ఈ ఓటింగ్‌లో 51-49 తేడాతో బిల్లుకు ఆమోదం తెలిపారు. ఈ బిల్లుపై డెమోక్రట్లందరూ తీవ్రంగా వ్యతిరేకించారు.
The latest Senate draft bill will destroy millions of jobs in America and cause immense strategic harm to our country!
Utterly insane and destructive. It gives handouts to industries of the past while severely damaging industries of the future. https://t.co/TZ9w1g7zHF
— Elon Musk (@elonmusk) June 28, 2025
It’s peak demand time right now in Texas. A thousand megawatts of gas & coal plants have gone offline TODAY, more than 10,000 total. Plenty of power bc solar is cranking out >23,000 megawatts ON PEAK. Your policy is one of energy subtraction that will hurt grid reliability and… https://t.co/qYI85Lrrkj pic.twitter.com/b5qw67lAys
— Doug Lewin (@douglewinenergy) June 28, 2025
ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఒక విధ్వంసకర చర్య అని మస్క్ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో అమెరికాలోని పరిశ్రమలను కూడా తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆరోపించారు. మరో పోస్టులో ఈ బిల్లు రిపబ్లికన్ల యొక్క రాజకీయ ఆత్మహత్యగా పేర్కొంటూ నిర్వహించిన పోల్‌ను ప్రస్తావించారు. ఇది రుణ పరిమితిని 5 ట్రిలియన్ డాలర్లకు పెంచుతుందని ఎలాన్ మస్క్ వెల్లడించారు.