ENG vs IND : నెట్స్‌లో కోపంతో ఊగిపోయిన సిరాజ్.. నా బ్యాట్ ఎవరు విరగొట్టారు?.. వీడియో వైరల్..

Follow

ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు మ్యాచ్ కోసం నెట్స్‌లో టీమ్ఇండియా ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జూలై 2 నుంచి జరగనున్న ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని భారత ఆటగాళ్లు పట్టుదలగా ఉన్నారు.
తొలి మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌లో భారత మిడిల్ ఆర్డర్‌తో పాటు లోయర్ బ్యాటర్లు విఫలం కావడంతో టీమ్ఇండియా మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఈ క్రమంలో సీనియర్ పేసర్ సిరాజ్ తన బ్యాటింగ్‌ను మెరుగుపరచుకునేందుకు కఠోర సాధన చేశాడు.
అయితే.. ప్రాక్టీస్ సెషన్ సమయంలో అతడు తన బ్యాట్ విరిగిపోయినట్లుగా గమనించాడు. దీంతో అతడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘WHO BROKE MY BAT?!’
Siraj goes from rage to LOL in seconds!
He walked in confused, spotted his broken bat, threw some fake anger and still left with a big grin. Classic Siraj turning net drama into pure meme gold
#Siraj #TeamIndia #CricketFun #INDvsENGTest pic.twitter.com/9BjbS5ONEH
— TOI Sports (@toisports) June 29, 2025
టైమ్స్ ఆఫ్ ఇండియా షేర్ చేసిన వీడియో ప్రకారం.. సిరాజ్ నెట్స్‌లోకి అడుగుపెట్టగానే తన బ్యాట్ విరిగిపోయినట్లు గమనించాడు. దీంతో ఎవరు తన బ్యాట్ ను విరగగొట్టారో చెప్పాలని అక్కడ ఉన్న వారిని కోపంగా అడిగాడు. అయితే.. ఆ వెంటనే అతడు నవ్వేశాడు. మ్యాచ్ కోసం తీవ్రమైన సన్నాహాల మధ్య సిరాజ్ చర్య అక్కడ కాసేపు నవ్వులను రేకెత్తించింది.
ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు మ్యాచ్ కోసం నెట్స్‌లో టీమ్ఇండియా ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు