ICC | టీమిండియా చేతిలో దారుణ ఓటమి.. ఇంగ్లండ్‌ జట్టుకు జరిమానా..!

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
England

ICC : స్వదేశంలో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో భారత మహిళల జట్టు చేతిలో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్‌కు ఐసీసీ షాకిచ్చింది. స్లో ఓవర్ రేటు కారణంగా నాట్ సీవర్ బ్రంట్ (Nat Sciver-Brunt) నేతృత్వంలోని ఆతిథ్య జట్టుకు జరిమానా విధించింది. నాటింగ్‌హమ్‌లోని ట్రెంట్‌బ్రిడ్జ్‌లో నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయనందుకు ఇంగ్లండ్‌కు మ్యాచ్ ఫీజులో 10 శాతం ఫైన్ వేసింది. రిఫరీ ఫిర్యాదు మేరకు నాట్ సీవర్ బ్రంట్ తన పొరపాటును అంగీకరించింది. అందుకు ఐసీసీ విధించే మ్యాచ్ ఫీజులో కోతకు కూడా ఆమె ఓకే చెప్పింది.

తొలి టీ20లో భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఇంగ్లండ్ బౌలింగ్ యూనిట్ జడుసుకుంది. పవర్ ప్లేలో ఓపెనర్లు స్మృతి మంధానా(112), షఫాలీ వర్మ(20)ల జోరుతో బెంబేలెత్తిపోయిన ఇంగ్లీష్ సారథి నాట్ సీవర్ బౌలర్లను మార్చినా ఫలితం లేకపోయింది. మంధాన, డియోల్ వీరకొట్టుడుకు డీలా పడిన ప్రత్యర్థి బౌలర్లు నిర్ణీత సమయంలోపు ఓవర్లు పూర్తి చేయలేకపోయారు. రెండు ఓవర్లు వెనకబడడంతో మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించింది ఐసీసీ.

తిప్పేసిన శ్రీచరణి

సొంతగడ్డపై ఆధిపత్యం చెలాయించాలనుకున్న ఇంగ్లండ్‌కు భారత జట్టు ఊహించని ఓటమిని కానుకగా ఇచ్చింది. రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ గాయపడడంతో సారథిగా వ్యవహరించిన స్మృతి మంధాన విధ్వంసక సెంచరీతో కదం తొక్కింది. పొట్టి ఫార్మాట్‌తో మొదటి శతకంతో మంధాన గర్జించగా.. హర్లీన్ డియోల్(43) మెరుపు బ్యాటింగ్‌తో భారత్ 5 వికెట్లు కోల్పోయి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది.

Mandhana Ton

భారత బౌలర్ల ధాటికి ఛేదనలో ఆది నుంచి ఇంగ్లండ్ తడబడింది‌. తెలుగమ్మాయి శ్రీ చరణి(4-12) తిప్పేయడంతో వరుసగా వికెట్లు కోల్పోయిన ఆతిథ్య జట్టు 113కే ఆలౌటయ్యింది. కెప్టెన్ నాట్ సీవర్(66) అర్ధ సెంచరీతో పోరాడినా మిగతావాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టగా టీమిండియా 97 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.

ఇవి కూడా చదవండి

 

 

​ICC : స్వదేశంలో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో భారత మహిళల జట్టు చేతిలో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్‌కు ఐసీసీ షాకిచ్చింది. స్లో ఓవర్ రేటు కారణంగా నాట్ సీవర్ బ్రంట్ (Nat Sciver-Brunt) నేతృత్వంలోని ఆతిథ్య జట్టుకు జరిమానా విధించింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *