కాచిగూడ – మైసూర్, కాచిగూడ-చిత్తూరు రైళ్ల గోల్డెన్ జూబ్లీ వేడుకలు

Follow

కాచిగూడ, జూన్ 29 : రైల్వే ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించడమే ధ్యేయమని రైల్వే డిఆర్ఎం లోకేష్ విష్ణోయ్ అన్నారు. కాచిగూడ – మైసూర్, కాచిగూడ – చిత్తూరు(వెంకటాద్రి) రైళ్లు ప్రారంభించి నేటికి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆదివారం కాచిగూడ రైల్వేస్టేషన్‌లో రైల్వే డిఆర్ఎం కేక్ కట్ చేసి, గోల్డెన్ జూబ్లీ వేడుకలను నిర్వహించారు. అనంతరం డిఆర్ఎం రైల్వే ప్రయాణికులతో కలిసి సంబరాలను నిర్వహించారు.
ఈ సందర్భంగా డిఆర్ఎం మాట్లాడుతూ రైల్వే ప్రయాణికులకు ఉపయోగపడే మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాచిగూడ రైల్వేస్టేషన్ డైరెక్టర్ పికె బాలాజీ, సీనియర్ డివోఎం విద్యాధర్, స్టేషన్ మేనేజర్ మీనా, హైదరాబాద్ పిఆర్ఐ శైలేందర్ కుమార్‌తో పాటు వివిధ శాఖ సిబ్బంది, ప్రయాణికులు పాల్గొన్నారు.
కాచిగూడ – మైసూర్, కాచిగూడ – చిత్తూరు(వెంకటాద్రి) రైళ్లు ప్రారంభించి నేటికి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆదివారం కాచిగూడ రైల్వేస్టేషన్‌లో రైల్వే డిఆర్ఎం కేక్ కట్ చేసి, గోల్డెన్ జూబ్లీ వేడుకలను నిర్వహించారు.