‘మహా న్యూస్‌’ ఛానల్‌పై చర్యలు తీసుకోవాలి

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Lingala Kamal Raju
  • బీఆర్‌ఎస్‌పై తప్పుడు ప్రసారాలు మానుకోవాలి
  • ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్‌ కమల్‌రాజు

బోనకల్లు, జూన్‌ 29: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాసిచ్చిన స్క్రిప్ట్‌ ఆధారంగా మహా న్యూస్‌ ఛానల్‌ మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావులపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తూ ప్రసారాలు చేయడం దారుణమని, మరోసారి ఇలా జరిగితే తగిన గుణపాఠం చెబుతామని ఖమ్మం జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం బోనకల్లు మండలంలోని రావినూతల గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మీడియాకు స్వేచ్ఛ ఉందని తప్పుడు వార్తలు ప్రసారం చేయడం బాధాకరమని, మహా న్యూస్‌ ఛానల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

తెలంగాణ రాష్ట్రం అంటే ఇష్టంలేని వారు కేసీఆర్‌ నాయకత్వాన్ని డ్యామేజ్‌ చేసేలా కుట్రలు పన్నుతున్నారన్నారు. తొమ్మిదేళ్ల కేసీఆర్‌ పాలనలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. 14 ఏళ్లు సుదీర్ఘ పోరాటం చేసి రాష్ర్టాన్ని సాధించి అభివృద్ధి పథంలో నడిపించారన్నారు. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్లీ తెలంగాణను కాపాడుకోవడానికి ప్రతిఒక్కరూ పోరాటానికి సిద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మధిరలో డిప్యూటీ సీఎం షాడోలు పరిపాలన చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే 90 రోజుల్లో 420 హామీలు అమలు చేస్తామని మాయమాటలు చెప్పిందని, అధికారంలోకి వచ్చి 19 నెలలు గడిచినా అభివృద్ధి శూన్యమని విమర్శించారు.

ఈ హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి గ్రామస్థాయి కాంగ్రెస్‌ నాయకుడి వరకు అందరూ కసి బీఆర్‌ఎస్‌పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. వీటిని తిప్పి కొట్టేందుకు వ్యవహరిస్తున్న సోషల్‌ మీడియాపై కేసు నమోదు చేస్తున్నారన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు, మధిర మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ బంధం శ్రీనివాసరావు, మాజీ జడ్పీటీసీ బానోతు కొండ, నాయకులు వేమూరి ప్రసాద్‌, గద్దల వెంకటేశ్వర్లు, పారా ప్రసాద్‌, జెర్రిపోతుల రవీందర్‌, వంగాల కృష్ణ, గొల్లమందల రాజారావు, ఏడుకొండలు, అనంతరామయ్య పాల్గొన్నారు.

​ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాసిచ్చిన స్క్రిప్ట్‌ ఆధారంగా మహా న్యూస్‌ ఛానల్‌ మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావులపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తూ ప్రసారాలు చేయడం దారుణమని, మరోసారి ఇలా జరిగితే తగిన గుణపాఠం చెబుతామని ఖమ్మం జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *