Actress Laya: స్లిమ్ సీక్రెట్ చెప్పేసిన లయ.. 43 ఏళ్ల వయసులో అందం వెనుక రహస్యం ఇదేనట..

Follow
తెలుగు సినీప్రియులకు పరిచయం అవసరంలేని పేరు లయ. ఒకప్పుడు అందం, అభినయంతో జనాల హృదయాలను గెలుచుకుంది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ సహజ నటన, సంప్రదాయ పద్దతిలో కనిపిస్తూ తనదైన నటనతో మెప్పించింది. కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ అయ్యింది.
పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండిపోయింది లయ. కానీ కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయ్యింది. సూపర్ హిట్ పాటలకు డ్యాన్స్ చేస్తూ రీల్స్ షేర్ చేసింది. అలాగే కొన్నాళ్ల క్రితం యూట్యూబ్ కు ఛానల్ కు ఇంటర్వ్యూకు ఇచ్చి మరోసారి తెలుగువారి ముందుకు వచ్చింది. ఇక ఇప్పుడు తెలుగులోకి కంబ్యాక్ అవుతుంది లయ.
ప్రస్తుతం తమ్ముడు చిత్రంలో కీలకపాత్రలో నటిస్తుంది. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. అయితే లయ ఇప్పటికీ హీరోయిన్ మెటిరీయల్. ప్రస్తుతం ఆమె వయసు 43 సంవత్సరాలు. కానీ ఇప్పటికీ 30 ఏళ్ల భామలాగే కనిపిస్తుంది. తాజాగా తన బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసింది.
తన ఫిట్నెస్ సీక్రెట్ ఏమి లేదని.. యోగా, జిమ్ లాంటివి కాకుండా కేవలం మితంగా తినడం మాత్రమే అంటుంది లయ. పెళ్లికి ముందు నుంచి తాను తక్కువగానే తింటానని.. ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నానని తెలిపింది. కడుపు నిండుగా తినడం అన్నది ఎంతవరకు జరగలేదని.. అందుకే సన్నగా ఉన్నట్లు తెలిపింది. ఇక నాన్ వెజ్ అసలు తినదట.
కానీ వంటకాలన్నీ స్పైసీగా ఉంటాయని.. పప్పు, కూరలు అన్నంలో ఎక్కువగా ఉండేలా చూసుకుంటానని తెలిపింది. వాటన్నింటిని తానే స్వయంగా తయారు చేసుకుంటుందిట. బయట ఫుడ్ తినదట. ప్రస్తుతం నితిన్ హీరోగా నటిస్తున్న తమ్ముడు సినిమాలో హీరోకు అక్క పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో అందం, అభినయంతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ లయ. తెలుగులో వరుస సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది. పెళ్లి తర్వాత చాలా కాలంపాటు సినిమాలకు దూరంగా ఉన్న లయ.. ఇప్పుడు తమ్ముడు సినిమాతో రీఎంట్రీ ఇస్తుంది. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ త్వరలోనే అడియన్స్ ముందుకు రాబోతుంది.