కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్?

Follow
X
Follow

కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ త్వరలో ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. శివకుమార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే హెచ్.ఏ. ఇక్బాల్ హుస్సేన్, “మరో రెండు, మూడు నెలల్లో శివకుమార్ సీఎం అవుతారు” అని చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత బలాన్నిచ్చాయి.
ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో డి.కె. శివకుమార్, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ముఖ్యమంత్రి మార్పుపై సిద్ధరామయ్య స్పందిస్తూ, అది పూర్తిగా పార్టీ అధిష్టానం పరిధిలోని విషయమని, దానిపై తాను బహిరంగంగా వ్యాఖ్యానించలేనని తెలిపారు.