TMC Leader Beats CPM Leader | సీనియర్ సీపీఎం నేతపై టీఎంసీ మహిళా నాయకురాలు దాడి.. చెప్పులతో కొట్టి, ఒంటిపై రంగు పోసింది

Follow

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న టీఎంసీ మహిళా నాయకురాలు బేబీ కోలే, సీపీఎం సీనియర్ నేత అనిల్ దాస్‌ను దారుణంగా కొట్టింది. (TMC Leader Beats CPM Leader) మహిళలతో కలిసి చెప్పులతో కొట్టడంతోపాటు ఆయనపై రంగు పోసింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సోమవారం ఖరగ్‌పూర్‌లోని రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఖరిడా ప్రాంతంలో ఒక వ్యక్తి ఇంటి గోడను బేబీ కోలే, ఆమె మనుషులు అక్రమంగా కూల్చివేయడాన్ని అనిల్ దాస్ వ్యతిరేకించారు. దీనిపై నిరసన తెలిపారు.
కాగా, టీఎంసీ మహిళా నాయకురాలు బేబీ కోలే, మరి కొందరు మహిళలు అనిల్ దాస్‌ను వెంబడించి ఆయనపై దాడి చేశారు. రద్దీగా ఉన్న రోడ్డు మధ్యలో ఆయన దుస్తులు చించడంతోపాటు చేతులతో, చెప్పులతో కొట్టారు. కిందపడిన అనిల్ దాస్‌పై రంగు పోశారు. అక్కడున్న జనం ఇది చూసినప్పటికీ ఎవరూ జోక్యం చేసుకోలేదు.
మరోవైపు ఈ సంఘటన తర్వాత సీపీఎం సీనియర్ నేత అనిల్ దాస్ తనపై జరిగిన దాడి గురించి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
SHOCKING VIRAL VIDEO from Kharagpur, West Bengal!
TMC leader Baby Koley caught on camera allegedly assaulting senior CPM leader Anil Das – beaten, clothes torn, ink splashed – all in broad daylight as bystanders look on in silence. pic.twitter.com/krYAMBV42i
— Megh Updates
(@MeghUpdates) June 30, 2025
Also Read:
Man Kills Daughter | చాక్లెట్ కొనేందుకు డబ్బులు అడిగిన కూతురు.. గొంతునొక్కి చంపిన తండ్రి
Watch: జలపాతంపైన నీటిలో జారిపడిన మహిళలు.. తర్వాత ఏం జరిగిందంటే?
TMC Leader Beats CPM Leader | పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న టీఎంసీ మహిళా నాయకురాలు బేబీ కోలే, సీపీఎం సీనియర్ నేత అనిల్ దాస్‌ను దారుణంగా కొట్టింది. మహిళలతో కలిసి చెప్పులతో కొట్టడంతోపాటు ఆయనపై రంగు పోసింది.