పోలీసు ఉద్యోగంలో ఎన్నో సవాళ్లు
Follow
– ఆర్థిక అంశాల్లో క్రమశిక్షణ పాటించాలి : రాచకొండ కమిషనర్ సుధీర్‌బాబు
నవతెలంగాణ-సిటీబ్యూరో
పోలీసు ఉద్యోగం ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాలని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో ఉద్యోగ విరమణ పొందిన 14 మంది పోలీస్ అధికారులను సోమవారం నేరేడ్మెట్లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీపీ ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ సుధీర్ఘ కాలం పోలీసు శాఖలో సమర్థవంతంగా, క్రమశిక్షణతో పనిచేసి సేవలు అందించినందుకు అభినందించారు. విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని, ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ చూపాలని, పెన్షన్‌తోపాటు ఇతర ఆర్థిక అంశాల పట్ల క్రమశిక్షణ పాటించాలని సూచించారు. వారికి రావాల్సిన అన్ని రకాల ప్రయోజనాలు త్వరగా ఉద్యోగ విరమణ పొందే అధికారులు, సిబ్బంది సంక్షేమం కోసం తాను ఏర్పాటు చేసిన పెన్షన్ డెస్క్ ద్వారా త్వరగా పెన్షన్ మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ అడ్మిన్ ఇందిర, అడిషనల్ డీసీపీ అడ్మిన్ శివ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రవీందర్‌రెడ్డి, సీఏఓలు అకౌంట్స్ సుగుణ, పుష్పరాజ్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు సీహెచ్.భద్రారెడ్డి, కృష్ణారెడ్డి, పోలీస్ కోఆపరేటివ్ సొసైటీ ట్రెజరర్ బాలరాజ్, డైరెక్టర్స్ సంగి వలరాజు, టేకుల రవీందర్ రెడ్డి, బి.సువర్ణ పాల్గొన్నారు.
The post పోలీసు ఉద్యోగంలో ఎన్నో సవాళ్లు appeared first on Navatelangana.
– ఆర్థిక అంశాల్లో క్రమశిక్షణ పాటించాలి : రాచకొండ కమిషనర్ సుధీర్బాబునవతెలంగాణ-సిటీబ్యూరోపోలీసు ఉద్యోగం ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాలని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో ఉద్యోగ విరమణ పొందిన 14 మంది పోలీస్ అధికారులను సోమవారం నేరేడ్మెట్లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీపీ ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ సుధీర్ఘ కాలం పోలీసు
The post పోలీసు ఉద్యోగంలో ఎన్నో సవాళ్లు appeared first on Navatelangana.