అడ్మిషన్ ఇచ్చిన చోటే కొనసాగించండి.. ఎస్సీ గురుకుల సొసైటీకి హైకోర్టు ఆదేశం

Follow

హైదరాబాద్, జూన్30 (నమస్తే తెలంగాణ) : అడ్మిషన్ పొందిన చోటనే విద్యార్థులను కొనసాగించాలని ఎస్సీ గురుకుల సొసైటీని హైకోర్టు ఆదేశించింది. కోర్టు తీర్పుతో దిగొచ్చిన సొసైటీ ఆ మేరకు నిర్ణయం తీసుకున్నది. గౌలిదొడ్డి ప్రీమియర్ సీవోఈ కళాశాలలో ఇచ్చే నీట్, జేఈఈ శిక్షణకు గతంలో రాష్ట్రవ్యాప్తంగా రెండు దశల్లో ఎంట్రన్స్ నిర్వహించి మెరిట్ ఆధారంగా అడ్మిషన్ కల్పించారు. కానీ, ఈ ఏడాది ఎంపీసీ, బైపీసీకి వేర్వేరుగా ఏర్పాటుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా మెరిట్ ద్వారా వచ్చిన విద్యార్థులను, ప్రస్తుతం ఇంటర్లో 90శాతం మెరిట్ సాధించలేదని చెబుతూ ఇప్పుడు మరో కళాశాలకు బదిలీ చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. విద్యార్థుల వాదనలతో ఏకీభవించిన కోర్టు ఆ మేరకు ఉత్తర్వులిచ్చింది.
బదిలీ చేసిన చోటే చేరండి : వర్షిణి
కాలేజీల మార్పు విషయమై అనేక మంది బాధిత విద్యార్థులు, తల్లిదండ్రులు సోమవారం మరోసారి సొసైటీ ప్రధాన కార్యాలయానికి తరలివచ్చారు. తమను పూర్వ స్థానాల్లోనే కొనసాగించాలని ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి అలగు వర్షిణిని కోరారు. స్పందించిన ఆమె.. విద్యార్థుల ఉన్నతి కోసమే సంస్థాగత మార్పులు చేశామని తెలిపారు. విద్యార్థులు తమను బదిలీ చేసిన విద్యాసంస్థలోనే చేరాలని చెప్పి తిప్పిపంపారు.
అడ్మిషన్ పొందిన చోటనే విద్యార్థులను కొనసాగించాలని ఎస్సీ గురుకుల సొసైటీని హైకోర్టు ఆదేశించింది. కోర్టు తీర్పుతో దిగొచ్చిన సొసైటీ ఆ మేరకు నిర్ణయం తీసుకున్నది. గౌలిదొడ్డి ప్రీమియర్ సీవోఈ కళాశాలలో ఇచ్చే నీట్, జేఈఈ శిక్షణకు గతంలో రాష్ట్రవ్యాప్తంగా రెండు దశల్లో ఎంట్రన్స్ నిర్వహించి మెరిట్ ఆధారంగా అడ్మిషన్ కల్పించారు.