జూన్‌లో లోటు వర్షపాతం నమోదు.. 25 నాటికి రాష్ట్రంలో మైనస్‌ 36%

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Rains

హైదరాబాద్‌, జూన్‌ 30 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో జూన్‌లో లోటు వర్షపాతం నమోదైంది. జూన్‌ 1 నుంచి 25 వరకు రాష్ట్రంలో సాధారణం కంటే లోటు వర్షపాతం నమోదైంది. ఈ 25 రోజుల వ్యవధిలో సాధారణ వర్షపాతం 105.4 మిల్లీమీటర్లు కాగా.. కేవలం 67.2 మీల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే కురిసింది. అంటే మైనస్‌ 36% లోటు వర్షపాతం రికార్డయింది.

జిల్లాల వారీగా చూస్తే పెద్దపల్లి, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, జనగామ, మేడ్చల్‌ మల్కాజిగిరి, హైదరాబాద్‌, సూర్యాపేటలో అత్యంత లోటు వర్షపాతం నమోదైంది. వర్షాలు కురువకపోవడంతో రాష్ట్రంలోని సుమారు 46 వేల చెరువులు నీళ్లులేక వెలవెలబోతున్నాయి. అడపాదడపా కురిసిన వర్షాలను నమ్ముకొని విత్తనాలు వేస్తే అసలుకే మోసం వస్తుందేమోనని అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు.

శాస్త్రవేత్తల సూచనలు

వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ వ్యవసాయ శాస్త్రవేత్తలు పలు కీలక సూచనలు చేశారు. వర్షాధార పంటలైన పత్తి, సోయాబీన్‌, మక్కజొన్న, జొన్నలు, కందులు, పెసర్లు వేయాలనుకుంటున్న రైతులు భూమి 15-20 సెంటీమీటర్ల లోతు తడిస్తేనే నాట్లు వేయాలని సూచించారు.

​రాష్ట్రంలో జూన్‌లో లోటు వర్షపాతం నమోదైంది. జూన్‌ 1 నుంచి 25 వరకు రాష్ట్రంలో సాధారణం కంటే లోటు వర్షపాతం నమోదైంది. ఈ 25 రోజుల వ్యవధిలో సాధారణ వర్షపాతం 105.4 మిల్లీమీటర్లు కాగా.. కేవలం 67.2 మీల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే కురిసింది. అంటే మైనస్‌ 36% లోటు వర్షపాతం రికార్డయింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *