లక్ష చెస్ బోర్డుల పంపిణీ లక్ష్యంగా..

Follow

హైదరాబాద్, ఆట ప్రతినిధి : పాలమూరు ఎన్ఆర్ఐ నెట్వర్క్ ఆధ్వర్యంలో మొదలైన చెస్నెట్వర్క్ బృహత్తర కార్యక్రమానికి సిద్ధమైంది. తెలంగాణ గ్రామీణ, గిరిజన, పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను మరింత తీర్చిదిద్దే ఉద్దేశంతో గొప్ప ఆలోచనతో ముందుకువచ్చింది. ఆదివారం రవీంద్రభారతి వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు అతిథులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెస్ నెట్వర్క్ సహయంతో తెలంగాణ వ్యాప్తంగా లక్ష చెస్ బోర్డులు పంపిణీ చేసేందుకు పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరం ప్రతినిధులు ముందుకువచ్చారు.
చెస్ ద్వారా రాష్ట్రంలోని ప్రతిభ కల్గిన నిరుపేద విద్యార్థులకు అండగా నిలువాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు కావాల్సిన ఆలోచన, శక్తి సామర్థ్యాలను చెస్ ద్వారా అలవరిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా చెస్ బోర్డులను పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వేదకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొనగా, ఎన్ఆర్ఐ ఫోరం ప్రతినిధులు సుధీర్, రవిమేరెడ్డి, శ్రీధర్, మదన్మోహన్, సంజయ్‌కుమార్, కందిరవి, విమల పాల్గొన్నారు.
పాలమూరు ఎన్ఆర్ఐ నెట్వర్క్ ఆధ్వర్యంలో మొదలైన చెస్నెట్వర్క్ బృహత్తర కార్యక్రమానికి సిద్ధమైంది. తెలంగాణ గ్రామీణ, గిరిజన, పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను మరింత తీర్చిదిద్దే ఉద్దేశంతో గొప్ప ఆలోచనతో ముందుకువచ్చింది.