ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌కు భూమి కేటాయించొద్దు

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Student Union Leaders
  • పాలకమండలి నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి
  • కేయూ పరిపాలనా భవనం ఎదుట విద్యార్థి సంఘాల ఆందోళన

హనుమకొండ చౌరస్తా, జూన్‌ 30 : కాకతీయ యూనివర్సిటీకి చెందిన భూమిని వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌కు కేటాయించొద్దని విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. సోమవారం యూనివర్సిటీ పరిపాలనా భవనం ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐఎఫ్డీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి గడ్డం నాగార్జున, డీఎస్‌ఏ రాష్ట్ర కన్వీనర్‌ కామగోని శ్రావణ్‌, పీడీఎస్‌యూ ఉమ్మడి జిల్లా కార్యదర్శి మర్రి మహేశ్‌, బీఆర్‌ఎస్వీ యూనివర్సిటీ ఇన్‌చార్జి జెట్టి రాజేందర్‌, పీఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జయసూర్య, బీఎస్‌ఎఫ్‌ యూనివర్సిటీ అధ్యక్షుడు శివ, ఏఐడీఎస్‌వో జిల్లా ఉపాధ్యక్షుడు మధు, ఎస్‌ఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు సాయిలు మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌కు యూనివర్సిటీ భూములు కేటాయించేందుకు పాలకమండలి ఆమోదాన్ని వెంటనే వెనకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

యూనివర్సిటీ భూముల పరిరక్షణకు అధికారులు చర్యలు తీసుకోవాలని, అన్యాక్రాంతానికి గురైన స్థలాలను తిరిగి స్వాధీనపర్చుకోవాలని, వాటికి హద్దులు నిర్ణయించి ప్రహరీ నిర్మించాలన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో అనేక చోట్ల ప్రభుత్వ భూములున్నప్పటికీ యూనివర్సిటీలోనే ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ ఏర్పాటు చేయాలనుకోవడం దుర్మార్గమన్నారు. అనంతరం పరీక్షల నియంత్రణాధికారి కట్ల రాజేందర్‌కు వినతిపత్రం అందజేశారు. ఏఐఎఫ్‌డీఎస్‌ రాష్ట్ర గర్ల్స్‌ కన్వీనర్‌ మాస్‌ సావిత్రి, డీఎస్‌ఏ జిల్లా కన్వీనర్‌ ఉప్పుల శివ, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు అజయ్‌, బీఆర్‌ఎస్వీ నాయకులు పస్తం అనిల్‌, కొత్తూరు రోహిత్‌, పాలబోయిన రాజు, జువాజీ, శ్రీజిత్‌ పాల్గొన్నారు.

​కాకతీయ యూనివర్సిటీకి చెందిన భూమిని వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌కు కేటాయించొద్దని విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. సోమవారం యూనివర్సిటీ పరిపాలనా భవనం ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *