అర్హత లేకున్నా డాక్టర్లుగా చెలామణి

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Fake Doctors
  • మెడికల్‌ కౌన్సిల్‌ తనిఖీల్లో పట్టుబడిన నకిలీ వైద్యులు

సిటీబ్యూరో, జూన్‌ 30 (నమస్తే తెలంగాణ): వైద్యుడిగా కనీస అర్హత లే కుండా, కొన్ని రోజులు ఆసుపత్రుల్లో కాంపౌండర్‌లు గా చేసి ప్రస్తుతం వైద్యులమని చెప్పుకుంటూ అల్లోపతి వైద్యమందిస్తున్న నకిలీ వైద్యులు సోమవారం తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ జరిపిన దాడులకు చిక్కారు.

తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ డాక్టర్‌ మహేశ్‌ కుమార్‌, టీజీఎంసీ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ గుండగాని శ్రీనివాస్‌ వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ లోని షాబాద్‌, హైతాబాద్‌ ప్రాంతాల్లో నకిలీ దవాఖానలపై తనిఖీలు నిర్వహించగా, ఏ మాత్రం అర్హత లేకుండా ఓం సాయి ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్‌ పేరుతో లింగా చారి, శ్రవణ్‌ ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్‌ పేరుతో బాలరాజు, మధు శ్రీ క్లినిక్‌ పేరుతో భాగ్యశ్రీ అనే బీఎస్సీ నర్సింగ్‌ చేసిన మహిళ, ముస్తఫా క్లినిక్‌ పేరుతో ముస్తఫా, మాస్టర్‌ క్లినిక్‌ పేరుతో వెంకటేశ్‌, శ్రీ సాయితిని పేరుతో అంజయ్య , జంజం క్లినిక్‌ పేరుతో మహమ్మద్‌ గౌస్‌ అంజద్‌లు దాడిలో దొరికారు.

వీరి వద్ద వందల సంఖ్యలో డైక్లోఫెన్‌ సోడియం, ఇంజక్షన్లు, కాల్షియం గ్లూకోనేట్‌ ఇంజక్షన్లు, స్టెరాయిడ్‌, యాంటీబయాటిక్‌ ఇంజక్షన్లు గుర్తించారు. ప్రాథమిక చికిత్స కేంద్రం పేరుతో లైసెన్స్‌ లేకుండా అల్లోపతి క్లినిక్‌ నెలకొల్పి.. అర్హత లేకున్నా అల్లోపతి వైద్యం చేస్తున్నారు. వీరిపై ఎన్‌ఎంసీ చట్టం 34,54 ప్రకారం కేసు నమోదు చేసి, ఏడాది జైలు శిక్షతో పాటు రూ.5 లక్షల వరకు జరిమానా విధించనున్నాం.

​వైద్యుడిగా కనీస అర్హత లే కుండా, కొన్ని రోజులు ఆసుపత్రుల్లో కాంపౌండర్‌లు గా చేసి ప్రస్తుతం వైద్యులమని చెప్పుకుంటూ అల్లోపతి వైద్యమందిస్తున్న నకిలీ వైద్యులు సోమవారం తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ జరిపిన దాడులకు చిక్కారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *