మండల స్థాయిలో ధరల నిర్ణయ కమిటీలు

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *

– ఇసుక విక్రయ కేంద్రాలు పెద్ద సంఖ్యలో ఏర్పాటు
– ప్రజలపై భారం పడకుండా ఆదాయ మార్గాలను అన్వేషించండి: రిసోర్స్‌ మొబ లైజేషన్‌ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

మండల స్థాయిలో ధరల నిర్ణయ కమిటీలను ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సోమవారం డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో రెవిన్యూ రిసోర్స్‌ మొబ లైజేషన్‌పై సబ్‌ కమిటీ సభ్యులైన మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్‌ బాబుతో కలిసి సమీక్షించారు
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నేపథ్యంలో సామాన్యులకు నిర్మాణ సామాగ్రి అందుబాటులో ఉండేందుకు మండల స్థాయిలో కమిటీలు సమావేశమై ధరలు నిర్ణయించాలని అన్నారు. సామాన్యులకు ఇసుక అందుబాటులో ఉండాలని గత సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్రంలో 20 ఇసుక విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు ఈ సందర్భంగా అధికారులు మంత్రులకు వివరించారు. మార్కెట్‌ యార్డులు, ప్రభుత్వ స్థలాల్లో త్వరితగతిన రాష్ట్ర వ్యాప్తంగా సామాన్యులకు ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని సబ్‌ కమిటీ సభ్యులు అధికారులకు సూచించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై మంత్రుల బృందం చర్చించింది. సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయాల్లో భూముల బేసిక్‌ విలువను పెంచితే దరఖాస్తుదారులు ముందుకు వచ్చే అవకాశముంటుందని అధికారులు మంత్రుల బృందానికి వివరించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా గిరిజనులే ఇసుక క్వారీలు నిర్వహించేందుకు చేపట్టిన చర్యలపై సమావేశంలో చర్చించారు. రాష్ట్ర ప్రజలపై పన్ను భారం మోపకుండా ఆదాయం పెంచే మార్గాలను అన్వేషించాలని భట్టి అధికారులను ఆదేశించారు. రెవెన్యూ రిసోర్స్‌ మొబలైజేషన్‌ సబ్‌ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను చీఫ్‌ సెక్రటరీ ఆధ్వర్యంలో ప్రతిరోజు సమీక్ష నిర్వహించాలని సూచించారు. హైదరాబాద్‌ నగరంలోని కాలుష్య పరిశ్రమలను ఓఆర్‌ఆర్‌ వెలుపలకు తరలించే కార్యక్రమంపై పారిశ్రామిక వాడల వారీగా సబ్‌ కమిటీ అధికారులతో సమీక్ష నిర్వహించింది. మైన్స్‌, జియాలజీ శాఖలో ఉన్న వన్‌ టైం సెటిల్‌మెంట్‌ ప్రగతిని సబ్‌ కమిటీ సభ్యులు సమీక్షించారు. కమర్షియల్‌ ట్యాక్స్‌ విభాగంలో దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రం మెరుగైన స్థితిలో ఉందని సబ్‌ కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సందీప్‌ కుమార్‌ సుల్తానియా, కమర్షియల్‌ టాక్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ రిజ్వీ, మైన్స్‌ అండ్‌ జియాలజీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శ్రీధర్‌, డిప్యూటీ సీఎం స్పెషల్‌ సెక్రటరీ కృష్ణ భాస్కర్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

The post మండల స్థాయిలో ధరల నిర్ణయ కమిటీలు appeared first on Navatelangana.

​– ఇసుక విక్రయ కేంద్రాలు పెద్ద సంఖ్యలో ఏర్పాటు– ప్రజలపై భారం పడకుండా ఆదాయ మార్గాలను అన్వేషించండి: రిసోర్స్‌ మొబ లైజేషన్‌ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టినవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌మండల స్థాయిలో ధరల నిర్ణయ కమిటీలను ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సోమవారం డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో రెవిన్యూ రిసోర్స్‌ మొబ లైజేషన్‌పై సబ్‌ కమిటీ సభ్యులైన మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్‌ బాబుతో
The post మండల స్థాయిలో ధరల నిర్ణయ కమిటీలు appeared first on Navatelangana. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *