NTR | ఎన్టీఆర్‌ని దిల్ రాజు ఎలా పిలుస్తాడో తెలుసా.. మిగతా హీరోలతో ఎలా ఉంటాడు?

Follow

NTR | టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలలో దిల్ రాజు ఒకరు.ఆయన నిర్మాణంలో వచ్చిన గేమ్ ఛేంజర్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దీంతో ఇప్పుడు ఆయన నితిన్ హీరోగా రూపొందిన తమ్ముడు మూవీపై అంచనాలు పెట్టుకున్నాడు. తమ్ముడు చిత్రం నితిన్, డైరెక్టర్ వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో రూపొందగా, ఈ చిత్రం జులై 4న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దిల్ రాజు -నితిన్ మధ్య ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ జరగగా, ఈ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి.
ఈ ఇంటర్వ్యూలో నితిన్, ఇతర హీరోలతో ఉన్న అనుబంధాల గురించి దిల్ రాజును ప్రశ్నించాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ గురించి ప్రస్తావన రాగా, దిల్ రాజు సంతోషంగా స్పందిస్తూ .. తారక్‌కి నేను ‘నాన్న’ అని పిలుస్తాను. మా బంధం అంత స్నేహపూర్వకంగా ఉంటుంది. ‘బృందావనం’ సినిమా సమయంలో కొడాలి నాని ఎన్టీఆర్‌ను ‘నాన్న’ అని పిలిచేవాడు. అది నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అప్పటి నుంచే నేనూ తారక్‌ను ‘నాన్న’ అని పిలవడం మొదలుపెట్టాను. తారక్ కూడా ‘అన్న’ అని పిలుస్తాడు” అని చెప్పుకొచ్చారు దిల్ రాజు. ఇంతకుముందు ఎన్టీఆర్.. దిల్ రాజు బ్యానర్‌లో “బృందావనం” (2010), “రామయ్య వస్తావయ్యా” (2013) వంటి చిత్రాల్లో నటించి విజయాలు అందుకున్నారు.
భవిష్యత్తులో మీ బయోపిక్ తీసే అవకాశముందా? అని నితిన్.. దిల్ రాజుని ప్రశ్నించగా, దానికి ఆయన ఆసక్తికర సమాధానం అందించారు . ఎందుకు లేదు.. కచ్చితంగా కావాల్సిన కంటెంట్ ఉంటుంది. నేను దాదాపు 30 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్నాను. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ ఈ స్థాయికి వచ్చాను అని దిల్ రాజు చెప్పుకొచ్చారు. ఒకవేళ బయోపిక్ తీస్తే హీరోగా ఎవరైతే సెట్ అవుతారని నితిన్ అడగ్గా, దానికి దిల్ రాజు ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు. ‘చాలామంది నితిన్ నీ తమ్ముడిలా ఉంటారని చెబుతారు. అది నువ్వు ఒక్కడివే అని నాకు అనిపిస్తోంది’ అని చెప్పుకొచ్చాడు. దీంతో నితిన్ స్మైల్ ఇస్తూ నెక్ట్స్ క్వశ్వ్చన్ కు వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
NTR | టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలలో దిల్ రాజు ఒకరు.ఆయన నిర్మాణంలో వచ్చిన గేమ్ ఛేంజర్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దీంతో ఇప్పుడు ఆయన నితిన్ హీరోగా రూపొందిన తమ్ముడు మూవీపై అంచనాలు పెట్టుకున్నాడు