Hari Hara Veeramallu | ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్‌పై ఫుల్ హంగామా.. ఏకంగా అన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారా…!

Follow

Hari Hara Veeramallu |పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా హరిహర వీరమల్లు సినిమా కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. పలు వాయిదాల నడుమ ఈ సినిమాని జూలై 24న విడుదల చేస్తున్నారు.అయితే మూవీ ట్రైలర్ కోసంఎన్నో నెలలుగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ విడుదలకు రంగం సిద్ధమైంది. జూలై 3న ఉదయం 11:10 గంటలకు ఈ మోస్ట్ అవైటెడ్ ట్రైలర్‌ను గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ముఖ్యంగా ఈ ట్రైలర్‌ను థియేటర్లలో విడుదల చేయాలనే నిర్ణయంతో పవన్ ఫ్యాన్స్ ఆనందం అవధులు దాటింది.
ఇప్పటి వరకు ట్రైలర్ అనగానే యూట్యూబ్ లేదా సోషల్ మీడియా వేదికలలో మాత్రమే చూసేవారు. కాని ఈసారి మాత్రం మేకర్స్ ట్రెండ్ బ్రేక్ చేశారు. ట్రైలర్‌ను ఏకంగా ఆంధ్రప్రదేశ్‌లో 29 థియేటర్లలో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇందులో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, చిత్తూరు, ఒంగోలు వంటి పెద్ద నగరాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఫ్యాన్స్ థియేటర్ల వద్దే ఈ ట్రైలర్‌ను చూడాలని ఇప్పటికే భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. కట్ అవుట్లు, ఫ్లెక్సీలు, డీజే స్టెప్పులతో పవన్ అభిమానులు పండుగలా జరుపుకోబోతున్నారు.
చిత్ర యూనిట్ చెప్పిన మేరకు, ఈ ట్రైలర్ విజువల్‌గా ఓ రేంజ్‌లో ఉండబోతుంది. పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పాత్రలో అద్భుతమైన మాస్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని, బహుశా ఇది ఇప్పటి వరకు వచ్చిన అన్ని ట్రైలర్లను మించి ఉండబోతుందని చెబుతున్నారు.ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా నిధి అగర్వాల్ నటించగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈసారి విలన్ గా తెరపై హంగామా చేయబోతున్నాడు.
ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం క్రిష్ – జ్యోతికృష్ణ వహించారు. ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను ఏ.ఎం. రత్నం అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సినిమాలోని గ్రాఫిక్స్, విఎఫ్‌ఎక్స్, సెట్స్ అన్నీ హై స్టాండర్డ్స్‌లో రూపొందించినట్టు సమాచారం.
Hari Hara Veeramallu |పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా హరిహర వీరమల్లు సినిమా కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. పలు వాయిదాల నడుమ ఈ సినిమాని జూలై 24న విడుదల చేస్తున్నారు.అయితే మూవీ ట్రైలర్ కోసంఎన్నో నెలలుగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ విడుదలకు రంగం సిద్ధమైంది.