Adireddy Vasu: రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా జగన్ కుట్ర..!

Follow

Adireddy Vasu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను భయభ్రాంతులకు గురి చేసేలా.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ దురుద్దేశంతో, కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పరామర్శల పేరుతో వైఎస్ జగన్.. రాష్ట్ర ప్రజలను భయపెట్టేలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి రాగానే రప్పా.. రప్పా.. తలలు నరుకుతామని అనడంలో వారి ఉద్దేశ్యం ఏమిటని ప్రశ్నించారు. పైగా ఆ వ్యాఖ్యలను జగన్ ఖండిం కుండా పుష్పా సినిమా డైలాగులు అని వెటకారంగా చెప్పడం తగదని హితవు పలికారు. అధికారంలో ఉన్న ఐదేళ్లు రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ, పెట్టుబడులు తీసుకురాని వైఎస్ జగన్.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో వస్తున్న పెట్టుబడిదారులను ఉద్దేశ పూర్వకంగా భయపెట్టాలని పర్యాటనల పేరుతో బలప్రదర్శనలు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుదని ఆయన హెచ్చరించారు. జగన్ తన వాహనం కిందపడి నలిగిపోతున్న సింగయ్య అనే కార్యకర్తను పట్టించుకోకుండా వాహనం ముందుకు పోనిచ్చారంటే అతనికి మానవత్వం లేదని అర్థమవుతుందని మండిపడ్డారు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు.
Read Also: TG High Court: స్థానిక సంస్థల ఎన్నికలపై తీర్పు రిజర్వ్ చేసిన తెలంగాణ హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను భయభ్రాంతులకు గురి చేసేలా.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ దురుద్దేశంతో, కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పరామర్శల పేరుతో వైఎస్ జగన్.. రాష్ట్ర ప్రజలను భయపెట్టేలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.