Air India | అకస్మాత్తుగా 900 అడుగుల కిందకు దిగిన ఎయిర్ ఇండియా విమానం..

Follow

Air India | అహ్మదాబాద్‌లో గత నెల జరిగిన ఘోర విమాన ప్రమాదం యావత్తు దేశాన్ని తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసింది. లండన్ బయల్దేరిన ఎయిర్ ఇండియా (Air India) విమానం టేకాఫ్ అయిన నిమిషాల్లోనే ఓ బిల్డింగ్‌పై కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో దాదాపు 270 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ ఘటన జరిగిన రెండు రోజులకే మరో ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి వియన్నా (Delhi-Vienna Air India flight) బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఒక్కసారిగా 900 అడుగుల కిందకు దిగింది. వెంటనే అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని నియంత్రణలోకి తెచ్చుకోవడంతో ఘోర ప్రమాదం తప్పినట్లైంది.
ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 777 AI-187 విమానం గత నెల 14వ తేదీన తెల్లవారుజామున 2:56 గంటలకు ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్ట్ నుంచి వియన్నాకు బయల్దేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం 900 అడుగుల కిందకు పడిపోయింది (flight plunged 900 feet). దీంతో వార్నింగ్ సిగ్నల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పైలట్లు భద్రతాపరమైన చర్యలు చేపట్టడంతో విమానం నియంత్రణలోకి వచ్చింది. అనంతరం విమానం వియన్నా ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఈ ఘటనతో విమానంలోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విచారణకు ఆదేశించింది.
Also Read..
Kavya Maran | మీమ్స్‌పై స్పందించిన కావ్య మారన్.. ఇంతకీ ఏమన్నారంటే..?
Air India | అహ్మదాబాద్‌లో గత నెల జరిగిన ఘోర విమాన ప్రమాదం యావత్తు దేశాన్ని తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసింది.