Air India Flight | క్యాబిన్‌లో కాలిన వాసన.. వెనుదిరిగిన ఎయిరిండియా విమానం..!

Follow

Air India Flight : ఈ మధ్య కాలంలో ఎయిరిండియా (Air India) విమానాల్లో తరచూ సమస్యలు వెలుగు చూస్తున్నాయి. ఇటీవల అహ్మదాబాద్ (Ahmedabad) లో ఎయిరిండియాకు చెందిన AI-171 విమానం కుప్పకూలి 279 మంది మరణించినప్పటి నుంచి తరచూ లోపాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా మహారాష్ట్ర రాజధాని ముంబై (Mumbai) నుంచి తమిళనాడు రాజధాని చెన్నై (Chennai) కి బయలుదేరిన ఎయిరిండియా విమానంలో సమస్య తలెత్తింది.
శనివారం రాత్రి 10.55 గంటలకు AI-639 విమానం ముంబై నుంచి చెన్నైకి బయలుదేరింది. ఆ తర్వాత కాసేపటికే క్యాబిన్‌లో కాలిన వాసన రావడంతో పైలట్ ఆ విమానాన్ని వెనక్కి తీసుకొచ్చి ముంబైలోనే దించాడు. అనంతరం ఎయిరిండియా అధికారులు మరో విమానంలో ప్రయాణికులను చెన్నైకి పంపించారు.
ఈ విషయాన్ని ఎయిరిండియా అధికార ప్రతినిధి మీడియాకు వెల్లడించారు. ప్రయాణికులు, సిబ్బంది క్షేమమే తమ సంస్థ తొలి ప్రాధాన్యమని ఆయన చెప్పారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపారు.
Read More >>
మహిళను చంపి.. గోనె సంచిలో కుక్కి.. చెత్త లారీలో మృతదేహం..!
తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం.. ప్రకటించిన ఒడిశా సీఎం
477 డ్రోన్‌లు, 60 క్షిపణులు.. ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడి
గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. హమాస్ కీలక నేత హతం
ఎయిరిండియా విమాన ప్రమాదంలో కుట్ర కోణంపై దర్యాప్తు : కేంద్రం
భద్రాచలం ఆదివాసి మహిళలపై ప్రధాని మోదీ ప్రశంసలు
Air India Flight | ఈ మధ్య కాలంలో ఎయిరిండియా (Air India) విమానాల్లో తరచూ సమస్యలు వెలుగు చూస్తున్నాయి. ఇటీవల అహ్మదాబాద్ (Ahmedabad) లో ఎయిరిండియాకు చెందిన AI-171 విమానం కుప్పకూలి 279 మంది మరణించినప్పటి నుంచి తరచూ లోపాలు వెలుగుచూస్తున్నాయి.