Akhil Akkineni: జైనాబ్‌తో పెళ్లి తర్వాత అఖిల్ మొదటి ఇన్‌స్టా పోస్ట్.. ఏం షేర్ చేశాడో తెలుసా?

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Akhil Akkineni: జైనాబ్‌తో పెళ్లి తర్వాత అఖిల్ మొదటి ఇన్‌స్టా పోస్ట్.. ఏం షేర్ చేశాడో తెలుసా?

అక్కినేని హీరో అఖిల్ ఇటీవలే ఓ ఇంటివాడయ్యారు. తన ప్రియురాలు జైనాబ్ రవ్దీని అతను పెళ్లాడాడు. . జూన్ 6న జూబ్లీహిల్స్‌లో నాగార్జున నివాసంలో అఖిల్- జైనాబ్‌ల పెళ్లి వేడుక అట్టహాసంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు, స్నేహితులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ గ్రాండ్‌ వెడ్డింగ్ వేడుకలో సందడి చేశారు. నూతన దంపతులను మనసారా ఆశీర్వదించి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఇక పెళ్లి వేడుక తర్వాత 8న రిసెప్షన్ వేడుకలు కూడా ఘనంగా జరిగాయి. అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా జరిగిన రిసెప్షన్‌ వేడుకలో సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు. అఖిల్- జైనాబ్ రవ్డీల పెళ్లి వేడుక ఫొటోలు ఇప్పటికీ నెట్టింట వైరలవుతున్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అఖిల్ అక్కినేని పెళ్లి తర్వాత మొదటి పోస్ట్ పెట్టాడు. అందులో తన పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను మరిన్ని షేర్ చేశాడు. ‘ నా జీవితంలో అత్యుత్తమ రోజులో కొన్ని క్షణాలను మీతో పంచుకోవాలని నా హృదయానికి అనిపించింది’ అంటూ క్రేజీ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు అఖిల్. తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని మధుర జ్ఞాపకాలు అందించిన వారికి ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశాడు అక్కినేని అందగాడు.

గతేడాది ఆఖరులో అక్కినేని నాగచైతన్య వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. హీరోయిన్ శోభిత ధూలిపాళ్లతో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు. వీరి పెళ్లి జరిగిన కొద్ది రోజులకే అఖిల్ అక్కినేని ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. జైనాబ్ రవ్దీతో నిశ్చితార్థం జరిగినట్లు అక్కినేని నాగార్జున సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇక ఈ ఏడాదిలోనే వివాహబంధంలోకి అడుగుపెట్టి కొత్త జీవితానికి శ్రీకారం చుట్టాడు అఖిల్- జైనాబ్.

అఖిల్ అక్కినేని ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం లెనిన్ అనే చిత్రంలో నటిస్తున్నాడు అఖిల్. ఇందులో మొదట శ్రీలీలను హీరోయిన్ గా అనుకున్నారు. ఇప్పటికే పోస్టర్, గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఇవి అక్కినేని అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు శ్రీలలకు బదులు భాగ్యశ్రీ భోర్సేను తీసుకున్నట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

లెనిన్ సినిమాలో అఖిల్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

​అక్కినేని నాగార్జున రెండో కుమారుడు టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ పెళ్లి వేడుకలు ఇటీవలే ఘనంగా జరిగాయి. జైనబ్ రవ్డీతో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు అఖిల్. కాగా పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ షేర్ చేశాడు అఖిల్. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *