Akkineni Family : శోభిత వచ్చిన వేళ.. అక్కినేని ఫ్యామిలీకి కలిసొచ్చి.. అఖిల్ కూడా కొట్టేస్తే..

Follow

Akkineni Family : గత కొన్ని రోజులుగా అక్కినేని ఫ్యామిలీకి మంచి కాలమే నడుస్తుంది. అన్ని కలిసొస్తున్నాయి. సినిమా హిట్స్ అవ్వడమే కాక పేరు ప్రతిష్టలు పెరుగుతున్నాయి. అయితే పలువురు నెటిజన్లు ఇదంతా శోభిత మహిమ అంటున్నారు. శోభిత అక్కినేని ఇంట అడుగుపెట్టిన వేళా విశేషం అంటున్నారు. నాగచైతన్య – శోభిత ధూళిపాళ గత సంవత్సరం డిసెంబర్ 4 న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
పెళ్లి తర్వాత నాగచైతన్య తండేల్ సినిమాతో ఫిబ్రవరిలో రాగా ఆ సినిమా పెద్ద హిట్ అయింది. అంతకుముందు చైతు వరుసగా మూడు ఫ్లాప్స్ చూసాడు. పెళ్లి తర్వాత చైతు ఫస్ట్ హిట్ కొట్టాడని, అది కూడా 100 కోట్ల భారీ హిట్ అని అక్కినేని ఫ్యాన్స్ సంతోషించారు. నాగార్జున కూడా ఒక ఫ్లాప్, రెండు సినిమాలు యావరేజ్ లో ఉన్నారు. శోభిత అక్కినేని ఇంట అడుగుపెట్టాక ఇటీవల కుబేర సినిమాతో వచ్చి మంచి హిట్ కొట్టారు నాగ్. సినిమా హిట్ కొట్టడమే కాక నాగార్జున పాత్రకు మంచి అభినందనలు వస్తున్నాయి. అంతేకాకుండా రజినీకాంత్ కూలి సినిమా రిలీజ్ అవ్వకుండానే సినిమాలో ఆ సినిమాలో నాగ్ పాత్రపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇలా తండ్రీకొడుకులు ఇద్దరూ హిట్స్ కొట్టేసారు.
Also See : Pranita Subhash : అందంగా యోగాసనాలు వేస్తూ.. యోగా డే స్పెషల్.. ప్రణీత ఫొటోలు..
ఒక పెద్ద హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ ఇటీవలే తన నెక్స్ట్ సినిమా లెనిన్ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసాడు. గ్లింప్స్ తో ఈ సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. ఇక అక్కినేని ఫ్యామిలీ హీరోల్లో ఒకరైన సుమంత్ కూడా చాలా కాలం తర్వాత అనగనగా సినిమాతో మంచి హిట్ కొట్టాడు. అలా శోభిత రాకతో ఫ్యామిలిలో అందరికి కలిసొచ్చింది అంటున్నారు. మరి లెనిన్ పెద్ద హిట్ కొట్టేస్తే శోభిత వచ్చినవేళ అక్కినేని హీరోలకు బాగా కలిసొచ్చినట్టే అని భావించడం ఖాయం.
అక్కినేని హీరోల సినిమాల విషయం పక్కన పెడితే శోభితతో చైతు నిశ్చితార్థం అయ్యాక ఏఎన్నార్ నేషనల్ అవార్డు వేడుక, ఏఎన్నార్ 100 సంవత్సరాల వేడుక నిర్వహించారు. కేంద్రప్రభుత్వం కూడా ఏఎన్నార్ పేరిట స్పెషల్ స్టాంప్ విడుదల చేసింది. చైతు – శోభిత పెళ్లి తర్వాత అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి పీఎం మోదీని కూడా కలిశారు. నాగచైతన్య ఒక రెస్టారెంట్ సక్సెస్ తర్వాత పెళ్లి తర్వాత మరో రెస్టారెంట్ మొదలుపెట్టి అదికూడా సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్నాడు. ఇక అఖిల్ కి కూడా తాను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరిగింది ఇటీవలే. గోవాలో జరిగిన ఫిలిం ఫెస్టివల్ లో కూడా ఏఎన్నార్ సినిమాలు ప్రదర్శించి శతజయంతిని జరిపారు. ఇక చైతన్య కెరీర్లోనే నెక్స్ట్ భారీ బడ్జెట్ సినిమా చేయబోతున్నారు.
ఇలా ఓ పక్కన అక్కినేని హీరోల సినిమాలు వరుస హిట్స్ సాధించడం, అక్కినేని ఫ్యామిలీకు శుభాలు జరగడం, అక్కినేని ఫ్యామిలీకి మరింత గౌరవం రావడం.. ఇవన్నీ చూసి ఈ సంవత్సరం అంతా అక్కినేని ఫ్యామిలీకి బాగా కలిసొస్తుందని, శోభిత వచ్చిన తర్వాత అక్కినేని ఫ్యామిలీకి కలిసొచ్చిందని ఫ్యాన్స్, పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
శోభిత అక్కినేని ఇంట అడుగుపెట్టిన వేళా విశేషం అంటున్నారు.