Aleru Town : రోడ్డు కబ్జాపై హెచ్ఆర్‌సీని ఆశ్రయించిన బహదూర్‌పేటవాసులు

Follow

ఆలేరు టౌన్, జులై 01 : ఆలేరు మండలం బహదూర్‌పేట గ్రామ వాసులు పలువురు మంగళవారం తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. బహదూర్‌పేట గ్రామం నుండి చిన్న కందుకూరుకు వెళ్లే లింక్ రోడ్డును బర్మ మల్లయ్య, బర్మ కిష్టయ్య అనే వ్యక్తులు కబ్జా చేయడంతో తమ ఇండ్లు, పొలాలకు వెళ్లే దారి లేదని, కావునా కబ్జాదారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినప్పటికీ ఆలేరు సీఐ పట్టించుకోవడం లేదని, ఆక్రమణదారులకే సహకరిస్తున్నట్లుగా వారు ఆరోపించారు. కబ్జా చెర నుంచి రోడ్డును విడిపించి, ఆలేరు సీఐపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద చర్యలు తీసుకోవాల్సిందిగా బాధితుల తరపున రాయపురం భాస్కర్ కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు.
రోడ్డును కబ్జా చేసిన విషయమై గ్రామానికి చెందిన ఎరుకల (ఎస్టీ )కుటుంబాలు, గ్రామ రైతులు సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఎదుట తమ గోడును వెల్లబోసుకున్నారు. ఇండ్లు, పొలాలకు వెళ్లే దారి లేనందున తమకు ప్రభుత్వ నిధుల ద్వారా హెలికాప్టర్ కొనుగోలు చేసి ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
బహదూర్‌పేట గ్రామం నుండి చిన్న కందుకూరుకు వెళ్లే లింక్ రోడ్డును బర్మ మల్లయ్య, బర్మ కిష్టయ్య అనే వ్యక్తులు కబ్జా చేయడంతో తమ ఇండ్లు, పొలాలకు వెళ్లే దారి లేదని, కావునా కబ్జాదారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా బహదూర్‌పేట గ్రామ వాసులు కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.