Allu Arjun: శక్తిమాన్ గా అల్లు అర్జున్! ఫుల్ క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Allu Arjun: శక్తిమాన్ గా అల్లు అర్జున్! ఫుల్ క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

‘పుష్ప2 ‘ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇప్పుడు అతనితో సినిమాలు తీసేందుకు స్టార్ డైరెక్టర్లు, నిర్మాతలు క్యూలో ఉంటున్నారు. బాలీవుడ్ లో పేరున్న దర్శకుల నుంచి కూడా బన్నీకి ఆఫర్లు వస్తున్నాయని సమాచారం. ముఖ్యంగా ఆ మధ్యన సంజయ్ లీలా భన్సాలీ సినిమాలో అల్లు అర్జున్ నటిస్తాడని పుకార్లు షికార్లు చేశాయి. అందుకు తగ్గట్టుగానే అల్లు అర్జున్ రెండుసార్లు సంజయ్ లీలా భన్సాలీ కార్యాలయంలో కనిపించడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. ఈ కాంబినేషన్ పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అల్లు అర్జున్ మాత్రం ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో ఓ క్రేజీ ప్రాజెక్టుకు పచ్చ జెండా ఊపాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే అల్లు అర్జున్ సినిమాల లైనప్ కు సంబంధించి మరో ఆసక్తికర వార్త ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో నటించాల్సిన ఓ సూపర్ హీరో సినిమాలో అల్లు అర్జున్ నటించనున్నాడని నెట్టింట ప్రచారం జరుగుతోంది.

 

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సూపర్ హీరో ‘శక్తిమాన్’ ఆధారంగా ఓ సినిమా రాబోతోందనే వార్తలు గత సంవత్సరం నుంచి వినిపిస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ శక్తిమాన్ పాత్రలో కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు, రణవీర్ సింగ్ బదులుగా అల్లు అర్జున్ శక్తిమాన్ పాత్రను పోషిస్తారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే శక్తిమాన్ అవతారంలో బన్నీAI జనరేటెడ్ పోస్టర్లు నెట్టింట బాగా హల్ చల్ చేస్తున్నాయి. ఈ సూపర్ హీరో సినిమాకు మలయాళ నటుడు, దర్శకుడు బాసిల్ జోసెఫ్ దర్శకత్వం వహిస్తారని వార్తలు వస్తున్నాయి. తాజాగా వీటిపై బాసిల్ జోసెఫ్ స్పందించాడు. ‘శక్తిమాన్’ సినిమాలో రణవీర్ సింగ్ నే హీరోగా ఉంటాడని బాసిల్ క్లారిటీ ఇచ్చారు. అందులో ఎటువంటి మార్పు లేదని అతను తేల్చి చెప్పాడు.

ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో కలిసి ఓ హాలీవుడ్ తరహా మూవీలో నటిస్తున్నాడు. ఆ తర్వాత బాసిల్ జోసెఫ్ తో కలిసి ఒక చిత్రంలో నటించనున్నాడని ప్రచారం జరుగుతోంది. మరోవైపు రణవీర్ సింగ్ ప్రస్తుతం ‘డాన్ 3’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహిస్తున్నాడు.

AA 22  అనౌన్స్ మెంట్ గ్లింప్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

​’పుష్ప 2′ సినిమా విజయం తర్వాత, అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది. ఇప్పుడు అతనితో సినిమా తీసేందుకు స్టార్ డైరెక్టర్లు సైతం పోటీ పడుతున్నారు. ఇందులో బాలీవుడ్ దర్శకులు కూడా ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓ సూపర్ హీరో సినిమాలోనూ అల్లు అర్జున్ నటిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *