Aminpur | అమీన్‌పూర్‌లో సెంట్రింగ్ మహిళ దొంగల అరెస్టు

Follow

అమీన్‌పూర్ జూన్ 27 : నిర్మాణాలు కొనసాగుతున్న భవనాల వద్ద నుంచి సెంట్రింగ్ డబ్బా దొంగతనాలకు పాల్పడుతున్న మహిళలను శుక్రవారం అమీన్‌పూర్ పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. సీఐ నరేష్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆరుగురు మహిళలు అమీన్‌పూర్ చెరువు పక్కన నిర్మాణం అవుతున్న ఆదిశ్రీ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్ట్ సెక్షన్ల వద్ద నుండి సెంట్రింగ్ డబ్బా దొంగతనాలకు పాల్పడ్డారు.
వారి ఫిర్యాదు మేరకు వాహనంలో అనుమానస్పద స్థితిలో వెళ్తున్న మహిళలను విచారించగా సెంట్రింగ్ డబ్బా దొంగతనం తామే చేశామని ఒప్పుకున్నారు. దీంతో కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్ నరేష్ పేర్కొన్నారు.
నిర్మాణాలు కొనసాగుతున్న భవనాల వద్ద నుంచి సెంట్రింగ్ డబ్బా దొంగతనాలకు పాల్పడుతున్న మహిళలను శుక్రవారం అమీన్‌పూర్ పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు.