Andhra News: కష్టపడి కంటికి రెప్పలా పెంచాడు.. కొడుకు కసాయిగా మారడంతో …

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Andhra News: కష్టపడి కంటికి రెప్పలా పెంచాడు.. కొడుకు కసాయిగా మారడంతో …

ప్రతి తల్లిదండ్రుకు ఒకే కోరిక ఉంటుంది. తాము ఎంత కష్టపడినా సరే కానీ.. పిల్లలను మాత్రం మంచిగా చదివించి వాళ్లకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని. కానీ తల్లిదండ్రుల రెక్కల కష్టంపై ఎదిగిన కొందరు కొడుకులు పెద్దయ్యాక వాళ్లకే తలనొప్పిగా మారుతున్నారు. తాజాగా అలాంటి ఒక వార్తే ఎన్టీఆర్ జిల్లాలో వెలుగు చూసింది. మద్యానికి గానిసైన కొడుకు ప్రవర్తనతో విసిగిపోయిన ఓ తండ్రి చివరకు కన్న కొడుకునే కడతేర్చాల్సిన పరిస్థితి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాళ ప్రకారం..ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేట గ్రామానికి చెందిన గోళ్ల కృష్ణ కుమారు అనే వ్యక్తికి వెంకట నారాయణ అనే కుమారుడు ఉన్నాడు. తండ్రి కృష్ణకుమార్ కొడుకు ఎంతో కష్టపడి పెంచి పెద్దవాడిని చేశాడు. గత ఐదేళ్ల క్రితం కృష్ణకుమారి అనే మహిళతో అతనికి పెళ్లి చేసి ఓ ఇంటివాడిని చేశాడు.

కొన్నాళ్లుకు వెంకట నారాయణ, కృష్ణకుమారి దంపతులకు ఓ కుమారుడు, ఓ కూతురు పుట్టింది. అయితే, గత కొంతకాలంగా వెంకట నారాయణ తాగుడుకు అలవాటు పడ్డారు. రోజూ తాగి వచ్చి ఇంట్లో భార్యతో పాటు తల్లిదండ్రులను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడం స్టార్ట్‌ చేశాడు. ఇక భర్త ప్రవర్తనను భరించలేకపోయిన భార్య ఐదేళ్ల క్రితం అతన్ని వదిలేసి వెళ్లిపోయింది. భార్య వదిలేసి వెళ్లింది. కానీ తల్లిదండ్రులు అలా వదిలేసి వెళ్లలేరు కదా.. కన్న పాపానికి కొడుకును భరించడం మినహా వాళ్లకు మరో దారి లేదు.

అయితే భార్య వెళ్లిపోయాక వెంకట నారాయణ ప్రవర్తన మరింత మొండిగా మారింది. రోజు తాగి రావడం..తల్లి దండ్రులను కొట్టడం ఇలా రోటీన్‌గా మారిపోయింది. తమను కొట్టవద్దని, తాగుడు మానుకోవాలని తల్లిదండ్రులు ఎంత చెప్పినా వెంకట నారాయణ పట్టించుకోలేదు. మళ్లీ రోజులానే సోమవారం రాత్రి సమయంలో కూడా ఫుల్‌గా తాగి ఇంటికి వచ్చి తన తల్లిదండ్రులతో గొడవ పడి వారిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. దీంతో విసిగిపోయిన తండ్రి కొడుకుపైకి తిరగబడ్డాడు. పక్కనే ఉన్న చెక్క మొద్దును తీసుకొని కొడుకుపై దాడి చేశాడు. దీంతో వెంకట నారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

​ఎన్టీఆర్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. మద్యానికి బైనిసై తమను ఇబ్బందులకు గురిచేస్తున్న కసాయి కొడుకుని కన్నతండ్రే కడతేర్చాడు. జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేట గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *