Baba Ramdev | సహజంగానే మనిషి ఆయుర్దాయం 150 నుంచి 200 ఏళ్లు : బాబా రామ్‌దేవ్‌

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Baba Ramdev

Baba Ramdev | ప్రముఖ నటి షెఫాలీ జరీవాలా (Shefali Jariwala) అకాల మరణం తర్వాత యాంటీ ఏజింగ్ (Anti Ageing) మందుల వాడకంపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో యోగా గురు రామ్‌దేవ్‌ బాబా (Baba Ramdev) సంచలన వ్యాఖ్యలు చేశారు. సహజంగానే మనిషి ఆయుర్దాయం (natural age of humans) 100 సంవత్సరాలు కాదని పేర్కొన్నారు. 150 నుంచి 200 ఏళ్లు జీవిస్తారని తెలిపారు.

ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబా రామ్‌దేవ్‌ మాట్లాడుతూ.. ‘మానవుడి సహజ ఆయుర్దాయం 100 ఏళ్లు కాదు. మనిషి సహజంగానే 150 నుంచి 200 ఏళ్లు జీవిస్తారు. కానీ మన మెదడు, గుండె, కాలేయంపై మనమే ఎక్కువ భారం మోపుతున్నాం. 100 ఏళ్లలో తినాల్సిన ఆహారాన్ని 25 ఏళ్లకే తినేస్తున్నాం. అందుకే ఈ పరిస్థితి. ఆహార క్రమశిక్షణ, మంచి జీవనశైలి చాలా అవసరం’ అని చెప్పుకొచ్చారు. తనకు ప్రస్తుతం 60 ఏళ్లు అని, ఆహార నియమాలు, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి వల్లే సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని తెలిపారు.

ప్రముఖ నటి షెఫాలీ జరీవాలా గత నెల 27న మరణించిన విషయం తెలిసిందే. ఆమె మరణానికి ముందు జరిగిన పరిణామాలపై పోలీసులు విచారణ జరిపారు. ఆమె మృతికి సంబంధించి పలు వివరాలను వెల్లడించారు. ఆమె యవ్వనంగా ఉండేందుకు పలు మాత్రలతో పాటు ఇంజెక్షన్‌ తీసుకుంటూ వచ్చారన్నారు. జూన్‌ 27న ఇంట్లో పూజ సందర్భంగా ఉపవాసం ఉన్నారని.. కడుపు ఖాళీగా ఉండగా మందులు తీసుకోవడం బీపీ పడిపోయిందని ఉండవచ్చని.. దాంతో ఒక్కసారిగా సొమ్మసిలిపడిపోయారని చెప్పారు. అదే రోజు మధ్యాహ్నం ఆమె యవ్వనాన్ని కాపాడుకునేందుకు ఇంజెక్షన్ వేసుకున్నట్టు తెలుస్తోందన్నారు. రాత్రి కూడా ఆమె సాధారణంగా తీసుకునే టాబ్లెట్లు తీసుకున్నట్టు సమాచారం ఉందన్నారు.

Also Read..

“Shefali Jariwala | నటి షెఫాలీ జరీవాలా మృతిపై కీలక వివరాలు వెల్లడించిన పోలీసులు.. ఆ మాత్రలు అలా వేసుకోవడం వల్లే..!”

“Shefali Jariwala | కాంటా లగా పాట ఫేమ్ షెఫాలీ జరీవాలా.. గుండెపోటే కార‌ణ‌మా?”

Air India | అకస్మాత్తుగా 900 అడుగుల కిందకు దిగిన ఎయిర్‌ ఇండియా విమానం..

​Baba Ramdev | ప్రముఖ నటి షెఫాలీ జరీవాలా (Shefali Jariwala) అకాల మరణం తర్వాత యాంటీ ఏజింగ్ (Anti Ageing) మందుల వాడకంపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో యోగా గురు రామ్‌దేవ్‌ బాబా (Baba Ramdev) సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *