Bank Holidays July : మీకు బ్యాంకులో పని ఉందా? జూలైలో మొత్తం 13 రోజులు సెలవులు.. ఏయే రోజుల్లో పనిచేయవంటే? ఫుల్ లిస్ట్ మీకోసం..!

Follow

Bank Holidays July : మీకు ఈ జూలై 2025లో బ్యాంకు పని ఉందా? బ్యాంకుకు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన పని ఉంటే వెంటనే పూర్తి చేసుకోండి.. ఎందుకంటే.. ఈ నెలలో (Bank Holidays July) మొత్తం 13 రోజులు బ్యాంకులు పనిచేయవు. ప్రత్యేకించి క్యాష్ డిపాజిట్ చేయడం, పాస్‌బుక్ అప్‌డేట్ చేయడం, లాకర్ యాక్సెస్ చేయడం, KYC అప్‌డేట్ చేయడం వంటివి ఉంటే.. బ్యాంకుకు వెళ్లి పూర్తి చేసుకోండి.
ప్రతి నెల మాదిరిగానే, జూలై 2025లో బ్యాంకులు చాలా రోజులు మూతపడనున్నాయి. కొన్ని సెలవులు వారాంతాల్లో మరికొన్ని వివిధ రాష్ట్రాల్లో పండుగల కారణంగా బ్యాంకులు పనిచేయవు. మీకు ఏదైనా ముఖ్యమైన పనులను పూర్తి చేయాలంటే జూలైలో బ్యాంకులు ఎప్పుడు మూతపడనున్నాయో ఇప్పుడే తెలుసుకోండి..
జూలైలో మొత్తం 13 రోజులు సెలవులు :
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకు సెలవుల జాబితా ప్రకారం.. వారాంతపు సెలవులతో సహా జూలైలో మొత్తం 13 రోజులు బ్యాంకులు మూతపడతాయి. కానీ, ప్రతి రాష్ట్రంలో సెలవులు ఒకేలా ఉండవని గమనించాలి. మీ నగరంలో బ్యాంకు ఏ రోజున పనిచేస్తుందో లేదో చెక్ చేయడం చాలా ముఖ్యం.
Read Also : iQOO Z10 Lite 5G : అద్భుతమైన ఆఫర్.. ఐక్యూ Z10 లైట్ 5G అతి చౌకైన ధరకే.. జస్ట్ ఎంతంటే?
బ్యాంకులకు వారాంతపు సెలవులు :
జూలై 2025లో వారాంతపు సెలవుల కారణంగా బ్యాంకులు చాలా రోజులు మూతపడతాయి. ప్రతి వారం ఆదివారాల్లో బ్యాంకులు మూతపడతాయి. నెలలో రెండో, నాల్గవ శనివారాల్లో బ్యాంకింగ్ సేవలు కూడా పనిచేయవు.
ఈ నెలలో జూలై 6, జూలై 13, జూలై 20, జూలై 27 తేదీలలో ఆదివారం సెలవులు ఉంటాయి. జూలై 12 రెండో శనివారం, జూలై 26 నాల్గో శనివారం కావడంతో ఆ రోజుల్లో బ్యాంకులు కూడా పనిచేయవు. మీరు ఈ తేదీలలో కొన్ని ముఖ్యమైన బ్యాంకింగ్ పనులు పెట్టుకుంటే ముందుగానే పూర్తి చేసుకోవడం బెటర్.
మీ నగరంలో బ్యాంకులు ఎప్పుడు పనిచేయవంటే? :
కొన్ని రాష్ట్రాల్లో జరుపుకునే ప్రత్యేక పండుగల సందర్భంగా జూలై 2025లో బ్యాంకులు కూడా మూడతపడతాయి. ఈ సెలవులు అన్ని రాష్ట్రాలలో వర్తించవు. కానీ, ఈ పండుగలు జరుపుకునే ప్రదేశాలలో మాత్రమే బ్యాంకులు మూతపడతాయి. జూలైలో బ్యాంకు సెలవుల పూర్తి జాబితా ఓసారి చూద్దాం..
ఖర్చీ పూజ (Kharchi Puja) : జూలై 3, 2025 (గురువారం)న అగర్తల (త్రిపుర)లో బ్యాంకులు మూతపడతాయి.
గురు హరగోబింద్ జయంతి : జూలై 5, 2025 (శనివారం) జమ్మూ, శ్రీనగర్ (జమ్మూ కాశ్మీర్)లో బ్యాంకింగ్ సేవలు పనిచేయవు.
బెహ్ దీంక్లామ్ : ఈ పండుగ రోజున షిల్లాంగ్ (మేఘాలయ)లో 14 జూలై 2025 (సోమవారం) బ్యాంకులు మూతపడతాయి.
హరేలా పండుగ : 16 జూలై 2025 (బుధవారం) రోజున డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్)లో ఎలాంటి బ్యాంకింగ్ కార్యకలాపాలు ఉండవు.
యు తిరోత్ సింగ్ వర్ధంతి : 2025 జూలై 17వ తేదీ (గురువారం) షిల్లాంగ్ (మేఘాలయ)లో బ్యాంకులు మూతపడతాయి.
కేర్ పూజ : జూలై 19, 2025 (శనివారం) అగర్తల (త్రిపుర)లో బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవు.
ద్రుక్ప త్సే-జీ ( Drukpa Tse-Ji) : వేడుకల సందర్భంగా 28 జూలై 2025 (సోమవారం) గ్యాంగ్‌టక్ (సిక్కిం)లో బ్యాంకులు మూతపడతాయి.
ఈ బ్యాంకు సెలవులన్నీ వేర్వేరు రాష్ట్రాలకు చెందినవి. మీ నగరంలో బ్యాంకులు ఓపెన్ అయి ఉండవచ్చు. ఈ పండుగలు జరుపుకునే రాష్ట్రాల్లో మాత్రమే బ్యాంకులు పనిచేయవు. ఇతర రాష్ట్రాల్లో నగరాల్లో బ్యాంకులు తెరిచే ఉంటాయి. మీరు బ్యాంకుకు వెళ్లే ముందు ఓసారి సెలవుల జాబితాను చెక్ చేసుకోండి.
సెలవు దినాల్లో ఆన్‌లైన్ బ్యాంకింగ్ పనిచేస్తుందా? :
బ్యాంకు సెలవు దినాల్లో కూడా ఆన్‌లైన్ బ్యాంకింగ్ సర్వీసులు పనిచేస్తాయి. మీరు నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం, యూపీఐ ద్వారా చాలా సర్వీసులను వినియోగించవచ్చు. కానీ, NEFT, RTGS వంటి కొన్ని లావాదేవీల ప్రాసెసింగ్‌కు కొంత సమయం పట్టవచ్చు. చెక్ క్లియరెన్స్, డ్రాఫ్ట్ రిక్వెస్ట్, కేవైసీ అప్‌డేట్ లేదా అకౌంట్ క్లోజింగ్ వంటి పనుల కోసం నేరుగా బ్రాంచ్ కు వెళ్లాల్సి ఉంటుంది. బ్యాంకు సెలవులకు ముందే ఈ ముఖ్యమైన పనులన్నింటినీ పూర్తి చేసుకోవాలి.
ఆన్‌లైన్ బ్యాంకింగ్ సర్వీసులు అందుబాటులో ఉన్నప్పటికీ కొన్ని పనులను పూర్తి చేయలేరు. అందులో బ్యాంకుకు వెళ్లకుండా పూర్తి చేయలేని కొన్ని బ్యాంకింగ్ సర్వీసులు ఉన్నాయి. లోన్, ఫిక్స్‌డ్ డిపాజిట్, క్యాష్ డిపాజిట్ లేదా ఏదైనా చెక్కు అయినా, ఆర్బీఐ బ్యాంక్ సెలవు జాబితాను చెక్ చేయడం మంచిది.
Bank Holidays July : జూలై 2025లో బ్యాంకులకు మొత్తం 13 రోజులు సెలవులు ఉన్నాయి. ఏయే రోజుల్లో బ్యాంకులు పనిచేయబో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..