BCCI-IPL: బెంగళూరు తొక్కిసలాట ఘటన.. బీసీసీఐ కీలక నిర్ణయం!

Follow

ఐపీఎల్ 2025 సీజన్‌లో విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) 18 ఏళ్ల టైటిల్ నిరీక్షణకు తెరదించిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2025 ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి తొలిసారిగా టైటిల్ గెలుచుకుంది. ఎన్నో ఏళ్ల తర్వాత ఐపీఎల్ టైటిల్ గెలుచుకోవడంతో.. బెంగళూరులో విక్టరీ పరేడ్, చిన్నస్వామి స్టేడియంలో సెలబ్రేషన్స్ చేశారు. అయితే ఆర్‌సీబీ విజయోత్సవ వేడుకల సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వెలుపల తొక్కిసలాట జరిగి.. 11 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో ఆర్‌సీబీపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా.. కొందరు అరెస్ట్ కూడా అయ్యారు.
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ విజేతలు సెలబ్రేషన్స్‌కు తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలను బీసీసీఐ ప్రకటించింది. టైటిల్ గెలిచిన 3-4 రోజుల తర్వాతే సెలబ్రేషన్స్ చేసుకోవాలని రూల్ విధించింది. ఈవెంట్‌కు బీసీసీఐ బోర్డు పర్మిషన్ తీసుకోవాలని, 4 అంచెల భద్రత తప్పనిసరి అని స్పష్టం చేసింది. జిల్లా అధికారులు, పోలీసుల నుంచి అనుమతి పొందాలని సూచించింది. ఎయిర్‌పోర్ట్ నుంచి ఈవెంట్ వేదిక వరకు పూర్తి భద్రత ఉండాలిని పేర్కొంది.
Also Read: Rohit Sharma: ఆ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఏం ఎంచుకోవాలో మర్చిపోయా.. కుంబ్లేను కవర్ చేశా!
ఐపీఎల్ సెలబ్రేషన్స్‌కు బీసీసీఐ రూల్స్ ఇవే:
# టైటిల్ గెలిచిన 3-4 రోజుల తర్వాత సెలబ్రేషన్స్
# ఈవెంట్‌కు బోర్డు పర్మిషన్
# ఈవెంట్‌కు 4 అంచెల భద్రత
# జిల్లా అధికారులు, పోలీసుల అనుమతి
# ఎయిర్‌పోర్ట్ నుంచి ఈవెంట్ వేదిక వరకు పూర్తి భద్రత
ఐపీఎల్ 2025 సీజన్‌లో విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) 18 ఏళ్ల టైటిల్ నిరీక్షణకు తెరదించిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2025 ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి తొలిసారిగా టైటిల్ గెలుచుకుంది. ఎన్నో ఏళ్ల తర్వాత ఐపీఎల్ టైటిల్ గెలుచుకోవడంతో.. బెంగళూరులో విక్టరీ పరేడ్, చిన్నస్వామి స్టేడియంలో సెలబ్రేషన్స్ చేశారు. అయితే ఆర్‌సీబీ విజయోత్సవ వేడుకల సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వెలుపల తొక్కిసలాట జరిగి.. 11 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా