Beas River | హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ వర్షాలు.. ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న బియాస్‌ నది.. VIDEOS

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
River

Beas River | ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తుతున్నాయి. ఈ వర్షాలకు హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh) అతలాకుతలమవుతోంది. భారీ వర్షాలకు రాష్ట్రంలోని ప్రధాన నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నారు. దీంతో ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. తాజాగా ఈ కుంభవృష్టి కారణంగా మండి (Mandi) జిల్లాలోని బియాస్ నది (Beas River)కి వరద ప్రవాహం పెరుగుతోంది. నది ప్రస్తుతం ప్రమాదకస్థాయిలో ప్రవహిస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. మరోవైపు హిమాచల్‌ ప్రదేశ్‌కు భారత వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

బిలాస్‌పూర్, సోలన్, సిమ్లా, సిర్మౌర్, హమీర్‌పూర్, మండి, కాంగ్రా జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ‘కులు, ఉనా, చంబా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది’ అని తెలిపింది. భారీ వర్షాల కారణంగా అనేకచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యగా దాదాపు 129 రహదారులను మూసివేశారు. మండి, సిర్మౌర్‌ జిల్లాల్లో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సోలన్‌లో ఓ వంతెన కొట్టుకుపోయింది. రెడ్‌ అలర్ట్‌ నేపథ్యంలో పలు జిల్లాల్లో పాఠశాలలకు అధికారులు నేడు సెలవు ప్రకటించారు. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభం నుంచి రాష్ట్రంలో 20 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

Also Read..

No Fuel | నేటి నుంచి ఆ వాహనాలకు పెట్రోల్‌, డీజిల్‌ బంద్‌.. ఎందుకంటే?

Carolyn Levitt | ఇండో-పసిఫిక్‌లో భారత్‌ వ్యూహాత్మక మిత్రదేశం : కరోలిన్‌ లెవిట్‌

Bhubaneswar | కాలర్‌ పట్టి ఈడ్చుకెళ్లారు.. భువనేశ్వర్‌ మున్సిపల్‌ అధికారిపై బీజేపీ కార్పొరేటర్‌ దౌర్జన్యం

​Beas River | ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తుతున్నాయి. ఈ వర్షాలకు హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh) అతలాకుతలమవుతోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *