Bigg Boss Telugu 9: బిగ్ బాస్‌లోకి జబర్దస్త్ బ్యూటీ.. ఆల్రెడీ అడిగారంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..

Follow

బిగ్ బాస్ సందడి మళ్లీ షురూ కానుంది. తెలుగుతో పాటు ప్రముఖ భాషల్లో త్వరలోనే ఈ రియాలిటీ షో ప్రారంభం కానుంది. ఇక తెలుగు బిగ్ బాస్ విషయానికి వస్తే.. ఇప్పటికే ఎనిమిది సీజన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. తొమ్మిదో సీజన్ కోసం బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టే సరికొత్త హంగులు, కంటెస్టెంట్లతో త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 9 మొదలు కానుంది. దాదాపు మూడు నెలల పాటు జరిగే ఈ రియాలిటీ గేమ్ షో పాల్గొనే కంటెస్టెంట్ల పేర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గత సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా పలువురు బుల్లితెర సెలబ్రిటీలు, ఫేమస్ యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు హౌస్ లోకి అడుగు పెడుతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా ప్రారంభమైందని తెలుస్తోంది. ఇక ఎంటర్ టైన్మెంట్ అందించే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎంపిక కోసం బిగ్ బాస్ యాజమాన్యం గట్టిగానే కసరత్తు చేస్తోందట. కాగా ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఓ జబర్దస్త్ బ్యూటీ ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. జబర్దస్త్ తో పాటు సినిమాల్లోనూ నటిస్తూ బిజి బిజీగా ఉంటోన్న ఆమెను ఇప్పటికే బిగ్ బాస్ యాజమాన్యం సంప్రదించిందట. దీనిపై సదరు బ్యూటీ కూడా క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ ఆమె మరెవరో కాదు సత్యశ్రీ.
జబర్దస్త్ తో మంచి గుర్తింపు పొందిన కమెడియన్లలో సత్యశ్రీ కూడా ఒకరు. ముఖ్యంగా చమ్మక్ చంద్రతో కలిసి ఆమె చేసిన స్కిట్లు బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి. ఆ మధ్యన నితిన్ ఎక్స్ ట్రార్డినరి మ్యాన్ తదితర సినిమాల్లోనూ కనిపించింది సత్యశ్రీ.ప్రస్తుతం టీవీషోలతో పాటు సినిమాల్లోనూ మెరుస్తోందీ అందాల తార. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూకు హాజరైన సత్య శ్రీ బిగ్ బాస్ ఎంట్రీ పై ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ‘బిగ్ బాస్ కి నన్ను ఆల్రెడీ అడిగారు. అప్పుడు ఇంట్లో పరిస్థితుల వల్ల వెళ్ళలేదు. ఇప్పుడు అడిగితే వెళ్తాను. ఈ సీజన్ అయితే కుదరట్లేదనిపిస్తోంది. ఎందుకంటే నాకు ఇప్పుడు సినిమా కమిట్మెంట్స్ ఉన్నాయి. వచ్చే సీజన్ అడిగితే మాత్రం బిగ్ బాస్ కి వెళతాను’ అని చెప్పుకొచ్చింది సత్యశ్రీ.
సత్య శ్రీ డ్యాన్స్ వీడియో..
సత్యశ్రీ డైరెక్ట్ గానే ఆఫర్ మళ్లీ వస్తే వెళ్తాను అని చెప్పింది కాబట్టి బిగ్ బాస్ నిర్వాహకులు కూడా బిగ్ బాస్ తొమ్మిదో సీజన్ లోకి సత్యశ్రీ ని తీసుకొస్తారేమో చూడాలి.
మెగాస్టార్ చిరంజీవితో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
బిగ్ బాస్ సీజన్ మళ్లీ ప్రారంభం కానుంది. బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు తెలుగుతో పాటు అన్ని ప్రముఖ భాషల్లోనూ ఈ రియాలిటీ షో షురూ కానుంది. ఇక తెలుగు విషయానికి వస్తే.. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా 8 సీజన్లు పూర్తయ్యాయి. ఇక ఇప్పుడు సీజన్ 9కు రంగం సిద్ధం అవుతుంది.